ప్రముఖ చైనా మొబైల్ తయారీ సమస్త వివో ఇప్పటికే పలు రకాలుగా బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక స్మార్ట్ మొబైల్ ని విడుదల చేసింది. వివో v -27 సిరీస్ గల మొబైల్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది.తాజాగా ఈ సిరీస్ లో కొత్త మోడల్ మలేషియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కొత్త స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ ధర విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


Vivo -v27 మోడల్ మొబైల్ 8GB RAM+256 జిపి స్టోరేజ్ కలర్ సింగల్ వేరేటి మాత్రమే అందుబాటులో కలదు దీని ధర మలేషియా కరెన్సీ ప్రకారం..RM -1,299 అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా దీని విలువ రూ.23,400 కాగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ మొబైల్ లో 120HZ రిఫ్రెష్ రేట్ కెపాసిటీ కలదు. ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.62 అంగుళాల ఫుల్ హెచ్డి అమొలెడ్ డిస్ప్లేతో కలిగి ఉంటుంది. ఇక డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే 2400X1080 కలిగి ఉంటుంది హ్యాండ్ సెట్ media TEK hello G-99 SOC ప్రాసెస్ ద్వారా బెస్ట్ పర్ఫామెన్స్ అందిస్తుందట.


ఈ స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OS పైన కూడా పనిచేస్తుంది ఈ మొబైల్ డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ కలదు..OSI తో కూడిన 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు కెమెరాలు కలవు. సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాపిక్సల్ కెమెరాను అమర్చినట్లుగా తెలుస్తోంది. సింగిల్ కలర్ టెంపరేచర్ తో త్రిబుల్ రియల్ ఫ్లాష్ కూడా అందుబాటులో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4,600 MAH సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: