ప్రముఖ సోషల్ మీడియా ఫేస్ బుక్ అంటే తెలియని వారు దాదాపుగా ఉండరని చెప్పుకోవాలి. ఇది ఎంత పాప్యులర్ అని చెప్పడానికి తాజా సర్వేలే కారణం. రెండేసి ఫేస్ బుక్ అకౌంట్లను కలిగి ఉన్నవారి సంఖ్య.. దాని వాడకం లో దాదాపు 40 శాతానికి పైగానే ఉంటుందనే విషయం మీకు తెలుసా? దీనికి ప్రపంచ వ్యాప్తం గా కొన్ని కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వినియోగ దారుల అవసరాలకు అనుగుణం గా యాప్‌లో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశ పెడుతున్న విషయం అందరికీ తెలిసినదే.
ఈ క్రమం లో ఫేస్‌బుక్ తన యాప్‌లో ఓ సరికొత్త మార్పుని ఒక దానిని తీసుకు వచ్చింది. విషయం ఏమంటే త్వరలో ఎఫ్‌బీ యాప్ లోనే మెసేజ్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్ చేసే సదుపాయం కలిగించనుంది. వాస్తవానికి మెసెంజర్ రాక ముందు ఫేస్ బుక్ యాప్ లోనే యూజర్లు మెసేజ్‌లు యాక్సెస్ చేసే ఫీచర్ ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మరికొన్ని అనివార్య కారణాల వలన మెసేజ్‌ల కోసం ప్రత్యేక యాప్ కావాలని కంపెనీ భావించి.. మెజెంజర్ యాప్‌ను అందరూ డౌన్‌లోడ్ చేసుకొనే వెసులు బాటుని క్రియేట్ చేసింది.
మరి ఆ మెసెంజర్ ఏ రేంజు లో సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. దాంతో ఫేస్‌బుక్ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోెవడమే కాక యాప్ లో మెసేజ్ ఇన్‌బాక్స్‌ను తిరిగి తీసుకొచ్చింది. అవును, తమ అప్లికేషన్ లో యూజర్లకు మెసెంజర్ ఇన్‌బాక్స్‌ని యాక్సెస్ అందించే ఆప్షన్‌ను తాజాగా మరలా టెస్ట్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమం లో త్వరలో నే ఈ ఫెసిలిటీని అందరికీ అందు బాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ఫేస్ బుక్ లో మెసేజ్ ఇన్‌బాక్స్‌ను అందించడం ద్వారా కంటెంట్ డిస్కవరీ, షేరింగ్ మెరుగవుతుందని మెటా కంపెనీ తెలిపింది.