ఓ స్పెషల్ లుక్ లో ఓ కారు లాంటి బైక్ ముంబై రోడ్లపై దర్శనమిచ్చింది. దీనిని చూసేందుకు అక్కడి జనాలు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ అయిన పోలారిస్ ఈ మోటార్ సైకిల్ ని తయారు చేసింది.BikeWithGirl అనే యూట్యూబ్ ఛానల్‌లో దీనికి సంబంధించిన వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక పోతే ఇది చాలా విచిత్రంగా కనిపించే బైక్. ఈ బైక్‌ను రోడ్డుగా కనిపించే సమయంలో ప్రజలు మొదటగా దానిని సూపర్ కార్ అని అనుకున్నారు. కానీ స్లింగ్‌షాట్‌ రూపంలో ఉన్న ఈ బైక్ ముందు భాగంలో చాలా వెడల్పుగా వుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అచ్చం పోర్షే 911 కారు లాగానే ఉంటుంది. అంతేగాక దీనిపై ప్రయాణించేటప్పుడు కారుపై వెళుతున్న అనుభూతిని రైడర్ పొందుతాడు.ఈ బైక్ ముందు భాగంలో రెండు చక్రాలు వెనుక భాగంలో ఒక చక్రాన్ని కలిగి ఉంటుంది.ఇంజన్ ద్వారా దీని వెనుక చక్రానికి పవర్ అనేది పంపబడుతుంది. ఈ బైక్ లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో క్లామ్‌షెల్ బానెట్ పొందబడుతుంది. 


ముందు ఇంకా అలాగే వెనుక 18-ఇంచెస్ డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ ను కలిగి వుంది. అలాగే ఈ వాహనంని మోటర్ సైకిల్‌గా ఇంకా స్లింగ్‌షాట్‌లో ఇద్దరు వ్యక్తులు కూర్చునేలా డిజైన్ చేశారు.ఇక దీని సీట్ డిజైన్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కారు లాంటి బైక్ లో ఇద్దరు పక్క పక్కనే కూర్చునేలా ఇది ఉంటుంది. ఈ బైక్‌లో కారులో ఉన్నట్లుగా స్టీరింగ్ ను కూడా అందిస్తున్నారు. అలాగే ఈ కారు ఇన్‌స్ట్రుమెంట్ క్లాస్టర్ డిజిటల్ సెంటర్ కన్సోల్‌లో పాటు టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఇక దీనిలో స్పీకర్లను కూడా కంపెనీ ఫిక్స్ చేసింది.ఇక ఈ బైకిన్‌ ని కీ లేకుండా కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో పాస్‌వర్డ్‌ని నమోదు చేయడం ద్వారా ఈ బైక్‌ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బైక్ 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 204bhp వద్ద 193nm మాక్సిమం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ ఆటోమాటిక్ గేర్ బాక్స్‌తో ఫిక్స్ చేయబడింది. ఇక దీని దీ ధర మార్కెట్ లో సుమారు 1.5 కోట్ల రూపాయలు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: