సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిలో వాట్స్అప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ ద్వారా అనేక సమాచారాలను సైతం మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించవచ్చు. ఇప్పటివరకు మనం వాట్సాప్ స్టేటస్ లో కేవలం ఫోటోలను వీడియోలను పలు రకాలుగా విమోజీలను షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా మనం మాట్లాడే వాయిస్ను కూడా షేర్ చేసే విధంగా వాట్సప్ సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది.
1). మొదట స్మార్ట్ మొబైల్ లో వాట్సాప్ ను ఓపెన్ చేయాలి.. ఆ తరువాత స్టేటస్ విభాగంలో క్లిక్ చేయవలసి ఉంటుంది.
2). ఆ తర్వాత కుడివైపున కనిపించే పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయవలసి. ఆ వెంటనే అక్కడ మైక్ సింబల్ వస్తుంది వాటిపైన క్లిక్ చేసి మాటలు రికార్డు చేయవచ్చు.
3). అలాగే నొక్కి పట్టుకొని 30 సెకండ్ల వరకు ఆడియోను రికార్డు చేసుకోవచ్చట.
4). అయితే అలా రికార్డ్ అయిన వాయిస్ ను సెండ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది వెంటనే మీ స్టేటస్ గా ఆడియో క్లిప్ చూపి స్తుంది.
ఎవరైనా వాట్సాప్ లో వాయిస్ ని స్టేటస్గా పెట్టుకోవాలని ఉండే వారికి ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.