ఇక వాట్సప్ లో చేయకూడని తప్పులను ఒకసారి తెలుసుకున్నట్లు అయితే అవాంచిత అకౌంట్స్ లేదా వాట్సప్ షరతులను ఉల్లంఘన చేసేటువంటి వాటిని అసలు చేయకూడదు.ముఖ్యంగా లేటెస్ట్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అందించడం వల్ల అకౌంట్ సురక్షితంగా ఉంటుందట. అందుకే మనం వాట్సాప్ లో ఎలాంటి పనులు చేస్తే వాట్సాప్ నిషేధించగలదు అనే విషయాలను ఒకసారి.
మనం ఎవరికైనా తప్పు మెసేజ్ పంపడం వల్ల వాట్సప్ అకౌంట్ ని బ్లాక్ చేయవచ్చు.. మన వాట్సాప్ నుండి బ్లాక్ చేసిన అకౌంట్ కి మెసేజ్లు పంపకుండా ఉండాలి అలా చేయకుండా మెసేజ్లు పంపిస్తూ ఉంటే.. ఫిర్యాదు చేయడం వల్ల వాట్సప్ ఖాతాను నిషేధించబడుతుందట.
వాట్సప్ థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించడం వలన ఎన్నో ఇబ్బందుల్లో పడవచ్చు. ఈ థర్డ్ పార్టీ యాప్ను ఉపయోగిస్తున్న కారణంగా మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్ కూడా చేయవచ్చు.. వాట్సప్ డౌన్లోడ్ చేయని యాప్స్ మరియు వాటిని వాట్సప్ పైన ఎలాంటి హక్కులు ఉండవట.
బ్రాడ్ కాస్ట్ లిఫ్ట్ యొక్క మెసేజ్లను అతిగా నిరంతరం ఉపయోగించడం వల్ల అకౌంటు నిషేదానికి దారి తీయవచ్చని వాట్సాప్ సంస్థ తెలియ జేస్తోంది.
వాట్సాప్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం లేదా మరొ కరి అకౌంట్లు కాపీ చేయడం వంటివి చేయడం తీవ్రమైన పరిణామానికి దారితీస్తుంది. ఇలా చేస్తే వాట్సాప్ అకౌంట్ బ్లాక్ చేయబడుతుందట.
మీరు వాట్సాప్ ఏదైనా హానికరమైన మెసేజ్లను ఫైలను పంపినట్లు అయితే వాట్సప్ నిషేధించడం జరుగుతుందట.