1).మొబైల్ చార్జింగ్ లో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ అసలు వాడకూడదు.. ముఖ్యంగా కాల్స్, గేమ్స్ వంటివి అసలు వాడకూడదు. ఇలా వాడితే కచ్చితంగా బ్యాటరీ డెడ్ అవుతుందట.
2).స్మార్ట్ ఫోన్ చార్జర్ పాడైతే మరొకటి లేదా తక్కువ ధరకి కలిగిన చార్జర్లను అసలు ఉపయోగించకూడదు.. ఇలా చేయడం బ్యాటరీ వైఫల్యానికి కారణం అవుతుంది. వాస్తవానికి ప్రతి బ్రాండ్ కు చెందిన కంపెనీలు తమ ఫోన్ల కోసం పలు రకాలుగా చార్జర్లను విడుదల చేస్తూ ఉంటాయి. ఇతర మొబైల్ చార్జర్ ఫోన్లు అసలు ఉపయోగించకూడదు.
3).చాలామంది ఫోన్ పూర్తిగా డెడ్ అయ్యే వరకు చార్జింగ్ పెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా పాడవుతుంది కాబట్టి మీరు మొబైల్ ఆఫ్ చేయడానికి కొంత పర్సంటేజ్ ఉన్నప్పుడే ఫోన్ చార్జింగ్ చేయాలి.
కొంతమంది తమ మొబైల్స్ ను రాత్రిపూట చార్జింగ్ పెట్టి అలాగే వదిలేస్తూ ఉంటారు ఎందుకంటే బ్యాటరీని రాత్రిపూట చార్జి చేయడం వల్ల రోజంతా టెన్షన్ గా ఫ్రీగా ఉంటుందని భావిస్తారు కానీ ఇది చేయడం చాలా పెద్ద ప్రమాదమట.. ఓవర్ నైట్ చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీ పూర్తిగా దెబ్బతింటుంది. అంతేకాకుండా మొబైల్లో ఉండే కొన్ని భాగాలు కూడా దెబ్బ తింటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా 95% వచ్చేవరకు చార్జింగ్ మాత్రమే ఉంచి ఆ తర్వాత ఆఫ్ చేయాలి. ఇలాంటివి చేయకుంటే మొబైల్ ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.