యాపిల్ ఐఫోన్-15 మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ 6.6 అంగుళాల డిస్ప్లేతో లభించబోతున్నట్లు టాక్.. అలాగే 8 జిబి రామ్ 3mm ప్రాసెస్ టెక్నాలజీ తో పాటు A-17 బయోని చెప్పును కూడా కలిగి ఉంటుందట. 15 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్..A-17 బయోనిక్ SOC ఆధారంగా ఉంటాయట. ఈ స్మార్ట్ మొబైల్స్ కి బటన్స్ కు బదులుగా హస్టిక్ సెన్సార్ కలదు. అలాగే యూఎస్బీ టైప్ సి చార్జింగ్ కూడా కలిగి ఉండడం కీలక అంశమని చెప్పవచ్చు.
ఇక ఐఫోన్ 15 కెమెరాల విషయానికి వస్తే.. 48 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరాతోపాటు త్రిబుల్ కెమెరా కలిగి ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా సరికొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. ఐఫోన్ 15 తర్వాత కనీసం నాలుగు పాత మోడల్ ని కూడా ఆపేయాలన్నది యాపిల్ సంస్థ యొక్క ఆలోచన అన్నట్లుగా సమాచారం. ఐఫోన్ 15 తర్వాత.. ఐఫోన్ -14, ప్రో, ఐఫోన్ -12, ఐఫోన్ -13 వంటి వాటి ప్రొడక్షన్ ఆపేయాలని యాపిల్ నిర్ణయించుకున్నట్లుగా ఒక నివేదిక లో తెలియజేయడం జరిగింది. ఒక వేళ ఇవే జరిగితే ఇందులో కేవల కొన్ని మొబైల్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.