ఇక్కడ 60 ఏళ్ల పెద్దాయన టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు. తనలో దాగి ఉన్న ప్రతిభను చాటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలానికి చెందిన హబ్సిపూర్ గ్రామంలో ఉండే పబ్బ చంద్రం ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి ఔరా అనిపించాడు. కేవలం 16 వేల రూపాయల ఖర్చుతో ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక అతను తయారు చేసిన ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ ఎలాంటి పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనం లేకుండానే బైక్ తో సమానంగా ముందుకు దూసుకుపోతుంది.
60 ఏళ్ల పబ్బ చంద్రం కు ఇద్దరు కుమార్తెలు నలుగురు కుమారులు ఉన్నారు. ఇక పిల్లలందరికీ కూడా వివాహాలు జరిపి ఎవరిపై ఆధారపడకుండా చిరు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ వయసులో తన సొంత టాలెంట్ తో ఎలక్ట్రానిక్ సైకిల్ ను తయారు చేశాడు. పట్టుదలతో ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించాడు. అయితే అతను తయారు చేసిన ఎలక్ట్రానిక్ సైకిల్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇలా టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సాహిస్తే మరిన్ని కొత్త ఆవిష్కరణలు తెరమీదకి వస్తాయి అంటున్నారు స్థానికులు. ఈ ఎలక్ట్రానిక్ సైకిల్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.