ఇదే క్రమంలో పాపులర్ ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్ గూగుల్ పే వినియోగదారులకు ఓ కొత్త ఫీచర్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీ కాంటాక్ట్ లిస్ట్ లోని స్నేహితులు, కుటుంబ సభ్యులకు బిల్లును విభజించి సులభంగా పేమెంట్ చేసేయొచ్చు. ప్రతి వ్యక్తికి ఎంత చెల్లించాలని మాన్యువల్‌గా లెక్కించాల్సిన అవసరాన్ని ఈ ఫీచర్ ఈజీగా తొలగిస్తుంది.
ఉదాహరణకు మీరు నెలకు రూ.10,000 బిల్లు చెల్లించాలనుకుంటే, దీనిని ముగ్గురు కలిసి చెల్లించాలనుకోండి. ఆ బిల్లు మొత్తాన్ని స్ప్లిట్ చేసి ముగ్గురికి ఎంతెంత చెల్లించాలో లెక్కించి ఈజీగా యాపే మీకు చూపిస్తుంది. ఇక ఆ మొత్తం వారికి చెల్లించేలా రిమైండర్లు కూడా మీకు ఇక్కడ పంపుతుంది. దీనిని ఇలా వాడాలంటే గూగుల్ పేని ఓపెన్ చేసి మెయిన్ పేజీలో ఉన్న 'పే కాంటాక్ట్స్' ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన కొత్త స్క్రీన్ కింద 'న్యూ గ్రూప్' ఆప్షన్ మీకు కనిపిస్తుంది. తరువాత కాంటాక్ట్స్ పేర్లతో కొత్త స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇపుడు తాజా గూగుల్ పే కాంటాక్ట్స్ లిస్ట్ మీరు చూడవచ్చు. తద్వారా ఈ ప్రాసెస్ మొత్తాన్ని పూర్తి చేయవచ్చు.