ముందుగా మొబైల్ నీళ్లలో పడిన తడిసిన వెంటనే మొబైల్ ను ఆఫ్ చేయాలి.. మొబైల్ లోపలికి నీరు చేరితే ఆ తర్వాత ఫోన్ను ఆన్ లో ఉంచినట్లయితే చాలా నష్టం జరుగుతుంది. అలాగే మొబైల్ నీటిలో పడినప్పుడు ఆ నీటిని బయటికి పంపేందుకు దాని ఎక్కువ షేక్ చేస్తూ ఉండటం వల్ల ఆ నీరు లోపలి భాగానికి చేరే ప్రమాదం కూడా ఉంటుంది. మరి కొంతమంది మొబైల్ లోపల నీరు ఉన్నదాన్ని హెయిర్ డ్రయ్యర్ ద్వారా నీరుని ఆవిరి అయిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా చాలా ప్రమాదమే. హెయిర్ డ్రాయర్ వల్ల కొన్ని భాగాలు వేడెక్కి దెబ్బతినేలా చేస్తాయి.
మీ మొబైల్ సడన్గా నీళ్లలో పడితే ముందుగా ఏదైనా పొడి బట్టతో మొబైల్ ను తుడవాలి.. ఆ తర్వాత సుమారు ఒక రోజంతా మొబైల్ ని ఉపయోగించకుండా ఉండాలి.. ఆ తరువాత ఆ మొబైల్ ను తీసుకువెళ్లి బియ్యం సంచిలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ మొబైల్ ఫోన్ వేగంగా డ్రై అవుతుంది. బియ్యపు గింజలు హెడ్ ఫోన్ ,జాక్ చార్జింగ్ హోటల్లోకి వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.మీ మొబైల్ లో ఉండే సిమ్ కార్డులను తీసివేయాలి.. అలా మొబైల్ ని పూర్తిగా ఆఫ్ చేసిన తర్వాతే ఇవన్నీ చేయాలి.