కారులో ఏసీ ని ఆన్ చేసే ముందు మీరు కారులో నిల్వ చేయబడిన వేడిని కచ్చితంగా బయటికి పంపించాలి. దీని కోసం ఇగ్నిషన్ ఆన్ చేసే ముందు కారు కిటికీలను కాస్త కిందికి దింపడం మంచిది.. ముఖ్యంగా కారుని ఎప్పుడు కూడా చల్లని ప్రదేశంలో పార్కింగ్ చేయడం వల్ల ఏసీ సరిగ్గా పనిచేస్తుందట. ఎండ కు దూరంగా ఉంచడం వల్ల నీడలో ఉంచడం వల్ల ఏసీ వాహనం వేగంగా చల్లబడుతుందట.
మనం కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఏసి కండక్టర్ అధిక వేడిని బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యము.. అందులో ఉండే ధూళి దుమ్మును కూడా శుభ్రపరుస్తూ ఉండాలి.
కారు ఏసీ ని ఎక్కువ సేపు ఆన్ చేసిన తర్వాత కాస్త చల్లబడిన తర్వాత రీసెర్క్యులేషన్ మోడ్ని ఆన్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బయట గాలిని తీసుకోకుండా కేవలం లోపల ఉండే గాలిని తీసుకొని ఏసీ పైన ఒత్తిడి తగ్గిస్తుంది.
కారుని సర్వీసింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ఏసి ను కూడా సర్వీసింగ్ చేయడం మంచిది.
ఏసీ ఆన్ లో ఉన్నప్పుడు మీ కారు కిటికీలు పూర్తిగా మూసివేయాలి.. దీనివల్ల త్వరగా కారు చల్లబడుతుంది.
ఏసీ ఫిల్టర్ ను కూడా కచ్చితంగా క్లీన్ చేస్తూ ఉండాలి ఇందులో డస్ట్, ఇంధనం వంటివి పేరుకు పోతాయి కాబట్టి ఎయిర్ ఫిల్టర్ ను శుభ్రంగా ఉంచడం మంచిది.