స్మార్ట్ మొబైల్ కొనడమే కాదు దానికి కచ్చితంగా పౌచ్ వంటివి కొంటూ ఉంటాము. చాలా కంపెనీలు మొబైల్ తో పాటుగా పౌచ్ ను కూడా ఉచితంగా ఇస్తూ ఉన్న సందర్భాలు ఉన్నాయి. బయట మార్కెట్లో మనకి చాలా రకాల పౌచులు దొరుకుతూ ఉంటాయి. అయితే స్మార్ట్ ఫోన్ కి పౌచ్ వల్ల ఏమి లాభము.. ఈ విషయం చాలామందికి తక్కువగానే తెలుసు.. అయితే అందరికీ పౌచ్ ఉండడంవల్ల మొబైల్ కింద పడితే డ్యామేజ్ కాకుండా ఉంటుందనే విషయం మాత్రమే తెలుసు.. కానీ ఇలా పౌచ్ వేసుకోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని విషయం ఎవరు గ్రహించడం లేదు..
ఫోన్ కి పౌచులు వాడడం వల్ల కలిగే ప్రధాన సమస్య.. స్మార్ట్ మొబైల్ వేడెక్కుతుంది.. మొబైల్ వాడకపోయినా బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువగా యాప్స్ వర్క్ అవుట్ అవుతూ ఉంటాయి.. దీనివల్ల మొబైల్ త్వరగా హీట్ ఎక్కుతుంది. ఇదే పౌచ్ కి ఫోన్ కి ఉంటే ఫోన్లు మరింత హీట్ అవుతాయట. ఇలా మొబైల్ వేడెక్కడం మొబైల్ కే కాకుండా వాడే వారికి కూడా చాలా ప్రమాదము అందుకే కొద్దిసేపు అయినా మొబైల్ పౌచ్ ని తీసేస్తూ ఉండాలి ముఖ్యంగా గేమ్స్ ఆడే సమయంలో మొబైల్ కు పౌచ్ లేకుండా చూసుకోవడం ఉత్తమం.
అంతేకాకుండా మొబైల్ బ్యాక్ పౌచ్ వాడడం వల్ల ప్యానెల్ డిజైన్లు మార్పుతోపాటు కలర్ కూడా పోవడం వంటివి జరుగుతుంది. మొబైల్ బ్యాక్ పౌచ్ లో ఎక్కువగా బ్యాక్టీరియా కూడా చేరుతుందట.అందుకే స్మార్ట్ ఫోన్స్ వాడకం విషయంలో వైద్యులు వీటిని వాడకూడదని హెచ్చరిస్తూ ఉంటారు.