1). రూ.599:
బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం బెస్ట్ ప్లాన్ గా ఈ ప్లాన్ ని చేర్చడం జరిగింది ఈ ప్లాన్ తో రోజుకి 3GB డేటా తో పాటు 84 రోజుల వరకు అన్లిమిటెడ్ కాలింగ్స్ తోపాటు డైలీ 100 ఎస్ఎంఎస్ లు కూడా పొందవచ్చు. ఈ రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు..PRBT, ZING వట్టి సబ్స్క్రిప్షన్ తో పాటు జ్యోతిష్యం మరియు గేమ్స్ తో పాటుగా రాత్రి 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉచితంగా డేటాను కూడా ఉపయోగించుకోవచ్చట. అదనంగా లాభాలను కూడా కస్టమర్లకు ఈ ప్లాన్ ద్వారా రీచార్జ్ చేసుకునే వారికి ఇస్తున్నట్లు తెలుస్తోంది.
2). రూ.499:
బెస్ట్ ప్లాన్లలో మరొక ప్లాన్ ఇది. రూ.499 పైన చెప్పిన ప్లాన్ల ప్రకారం అన్ని విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు అయితే ఈ ప్లాన్ కేవలం 75 రోజులు మాత్రమే లభిస్తుంది. మరియు రోజుకి 2GB డేటాను మాత్రమే అందిస్తుందట.
3). రూ.319
బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.319 ప్లాన్ కూడా ఒకటి ఇది యూజర్లకు 65 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా పొందేలా చేస్తూ ఉంటుంది అలాగే 65 రోజులపాటు వ్యాలిడిటీ కోసం 10 GB మరియు 300 SMS ప్రయోజనం కూడా లభిస్తుంది. బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం ఇలా అదిరిపోయే ప్లాన్లను సైతం ప్రవేశ పెడుతూనే ఉంది.ఇవే కాకుండా మరికొన్ని బెస్ట్ ప్లాన్స్ కూడా బిఎస్ఎన్ఎల్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ పోటీలకు అనుగుణంగా ఇలాంటి ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది బిఎస్ఎన్ఎల్ సంస్థ.