తాజాగా ఇప్పుడు ఏసి లాంటి కూలింగ్ బెడ్ షీట్ మీద అందుబాటులోకి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఎంత వేడిలోనైనా సరే ప్రశాంతంగా నిద్రపోవచ్చట..AC ఇలాంటి బెడ్ షీట్ మంచి నిద్రతో పాటు ఈ వేడి నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. ఈ బెడ్ షీట్ వేసవి ఉక్కుపోతతో పాటు హాయిగా నిద్రను అందిస్తోంది. ఇది సాధారణ బెడ్ సీట్ల కనిపిస్తుంది .అయితే ఇందులో ఉపయోగించిన టెక్నాలజీ మాత్రం చాలా ప్రత్యేకతమని చెప్పవచ్చు. ఈ బెడ్ షీట్ కూలింగ్ జెల్ మ్యాట్రెస్.. అంటే శీతలీ కరణ కోసం జెల్ సాంకేతికను ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఈ బెడ్ షీట్ లోపల గాలి నింపబడి ఉంటుంది ఈ బెడ్ షీట్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా చాలా సైలెంట్ గా ఉంటుంది కూలర్ బెడ్ షీట్ నడుస్తున్నట్లుగా ఉంటుందట. ఈ కూలర్ బెడ్ షీట్ లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్ 4.5 వాట్ల శక్తిని మాత్రమే వినియోగిస్తుంది. దీంతో ఒక వారం పాటు రన్నింగ్ లో ఉన్న కేవలం ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు మాత్రమే అవుతుంది. దీని బరువు రెండు కిలోలుగా ఉంటుందని సమాచారం దీనిని మనం మడతపెట్టి ఎక్కడికైనా సరే తీసుకొని వెళ్లవచ్చు. ఈ బెడ్ షీట్ కూలింగ్ టైమర్ తో లభిస్తుంది. ఇందులో మనం టైమింగ్ సెట్టింగ్ చేసుకోవచ్చు.