దేశ రక్షణకు సంబంధించిన సమాచారం అది ఏ దేశానికైనా అత్యంత కీలకమైన సమాచారం. దానిని కాపాడుకోవడం ఆ దేశానికి అతి కీలకమైన బాధ్యత. అయితే అట్లాంటి సమాచారాన్ని ఇప్పుడు వెబ్సైట్లో జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటారు. కానీ ఆ రక్షణ వెబ్సైట్ లు కూడా ఇప్పుడు ఆ సమాచారం కోసం దాడికి గురవుతున్నట్లుగా తెలుస్తుంది. మామూలు వెబ్సైట్లో సమాచారం పోతేనే అది ఒక సమస్యగా భావిస్తూ ఉంటారు.


అట్లాంటిది దేశ రక్షణకు సంబంధించిన సమాచారం కనుక మిస్ అయితే అది ఆ దేశానికే ప్రమాదకరం. సైబర్ సెక్యూరిటీ నివేదికలో ఈ దాడుల గురించి బయటపడ్డాయని తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం పూనే లోని రక్షణ శాఖ శాస్త్రవేత్త ప్రదీప్ కులేకర్ అరెస్టు పెద్ద సంచలనాన్ని కలిగించింది. అగ్ని, ఆకాశ్ క్షిపణుల పరిజ్ఞాన పరిశోధన రంగంలో కీలకమైన వ్యక్తిగా ఉన్న ఆయన పాకిస్తాన్ గూడచార వ్యవస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్ లో పడ్డారు.


అనంతరం రక్షణశాఖ సంబంధించిన కీలకమైన వెబ్సైట్లు సైబర్ దాడికి గురయ్యాయి. కేవలం ఇది ఒక్క ఉదంతమే కాదు. భారతదేశంలోనూ ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఎన్నో వెబ్సైట్లు సైబర్ దాడులకు గురవుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. అందులోనూ ఈ వెబ్సైట్లో రక్షణ టెలి కమ్యూనికేషన్ కి సంబంధించిన వెబ్సైట్లు అధికంగా ఉండడంతో సమస్య సంక్లిష్టంగా మారిపోతుంది.


రక్షణ శాఖకు సంబంధించిన డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ‌టీం సంయుక్తంగా విడుదల చేసిన సైబర్ సెక్యూరిటీ నివేదిక భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వెబ్సైట్ల పై సైబర్ దాడుల ముప్పును వెల్లడిస్తుంది. 2018 తర్వాత వెబ్సైట్ల పై దాడి అనేది ఎక్కువ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఐదేళ్లలో ఏకంగా సైబర్ దాడులు 130శాతం వరకు పెరిగాయని చెప్తున్నారు. 2018లో  2,84,56,  2022 లో 13, 91,457 వెబ్సైట్లపై సైబర్ దాడులు జరిగాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: