ఇక ఆ జాబితాలో శ్యాంసంగ్ , గాపిల్ , పోకో అంటే మరెన్నో బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పలు బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లను కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అత్యంత తక్కువ ధరకు మీకు నచ్చిన ఫోన్లను మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంకు కార్డులు కలిగిన వారు కూడా ఏకంగా 10% అదనపు డిస్కౌంట్ ను సొంతం చేసుకోవచ్చు
పోకో ఎక్స్ 550 స్మార్ట్ ఫోన్ భారత్ లో రూ .18,999 కాగా ఈ సేల్ లో భాగంగా ఈ ఫోన్ ను మీరు రూ.15,999కి సొంతం చేసుకోవచ్చు. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కలిగిన వారు అదనంగా 1000 రూపాయల డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ ఫోన్ మీకు కేవలం రూ.14,999 లభిస్తుంది. అలా చూసుకున్నట్లయితే ఏకంగా ఈ స్మార్ట్ ఫోన్ పై మీరు నాలుగు వేల రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
అలాగే ఆపిల్ ఆన్లైన్ స్టోర్ లో 128gb స్టోరేజ్ వేరియంట్ ఐఫోన్ ధర రూ.69,900 ఉండగా అదే బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో కొనుగోలు చేస్తే రూ.58, 749కి సొంతం చేసుకోవచ్చు అంటే సుమారుగా 11,151 ఆదా అవుతుంది ఎస్బిఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే సుమారుగా రూ.750 అదనపు తగ్గింపు పొందవచ్చు. వీటితోపాటు మరెన్నో స్మార్ట్ఫోన్ బ్రాండ్లపై మీకు భారీ డిస్కౌంట్ లభించనుంది .