ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లలో వాట్సప్ కూడా ఒకటి.. గత కొద్ది రోజులుగా వాట్సాప్ యూజర్లకు ఎదురవుతున్న పలు సమస్యలకు చెక్ పెట్టే విధంగా ఆ సంస్థ పలు కీలకమైన ఫీచర్స్ ను విడుదల చేయడం జరిగింది. గతంలో వాట్సప్ వినియోగదారులు అంతర్జాతీయ స్కామ్ కాల్స్ తో ఇబ్బంది పడ్డారు.. ఈ విషయం పైన కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. దీంతో వాట్సాప్ సంస్థతో మాట్లాడుతూ ఈ విషయంపై త్వరలోనే గుడ్ న్యూస్ తెలియజేస్తామంటూ ప్రకటించడం జరిగింది గతంలో.


మెటా నేతృత్వంలో వాట్సాప్ విడుదల చేసిన ఫీచర్ మన మొబైల్లో ఉండే కాంటాక్ట్ లిస్టులో లేని నెంబర్ల నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఆ కాల్ సైలెంటుగా అయిపోతుందట. అంటే వాట్సప్ కాల్ వచ్చినా కూడా అది మనకి వినిపించదు.. ఈ ఫీచర్ను మెటా సీఈవో మార్క్ జుకార్బర్గ్ తన ఇన్స్టాగ్రామ్ ఛానల్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఆండ్రాయిడ్, IOS వంటి వాటిలో ఈ ఫీచర్ ను అందుబాటులో తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్ వినియోగదారులు తమ వ్యక్తిగత భద్రతను పరీక్షించడం కోసమే ఈ ఫీచర్ ఉద్దేశమని తెలియజేయడం జరిగింది.


గుర్తుతెలియని వ్యక్తుల నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు అందులో స్కామ్ స్పామ్ కాల్ ఈ ఫీచర్ గుర్తిస్తుందట.. దీని ద్వారానే మనకు తెలియని నెంబర్లనుంచి కాల్ వచ్చినప్పుడు మొబైల్ రింగ్ అవ్వదు. కేవలం వారి నెంబర్లు మాత్రమే వాట్సప్ కాల్ వివరాలలో చూపిస్తుంది. అయితే ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవాలనుకునేవారు వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్లి అనంతరం ప్రైవసీ పైన క్లిక్ చేయాలి అక్కడ కనిపించిన కాల్స్ ఆప్షన్ పైన టాప్ చేయాలి..SILENCE UNKNOWN CALLERS అనే ఆప్షన్ను ఎనేబుల్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్కామ్ స్పామ్ కాల్స్ వల్ల వాట్స్అప్ వినియోగదారులు చాలా అవస్థలు పడుతున్న నేపథ్యంలో వాట్సాప్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల 50 శాతం వరకు ఇలాంటి కాల్స్ గత నెలలో తగ్గిపోయాయని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: