ప్రముఖ స్మార్ట్ మొబైల్ తయారీ సంస్థ వివో సరికొత్త మొబైల్స్ కలిగిన మోడల్స్.. ఫీచర్స్ మొబైల్స్ ను విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు వివో Y-36 4G మొబైల్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల లీకులు వినిపిస్తూనే ఉన్నాయి.. కానీ ఈ స్మార్ట్ మొబైల్ 5 జి సపోర్ట్ చేయదు..కానీ అనేక ఫీచర్స్ తో ఈ మొబైల్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ డిస్ప్లేను కలిగి ఉండడంతో పాటు RAM, బ్యాటరీ బ్యాకప్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉన్నట్లు తెలియజేసింది వివో సంస్థ.


VIVO -Y 36 ఫోర్ జి మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.64 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే..2388X1080 పిక్సెల్ క్వాలిటీతో కలదు. ఈ స్మార్ట్ మొబైల్ క్వాల్కమ్  స్నాప్ డ్రాగన్ 680 రాసేస్తో కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ -13 ఆపరేటింగ్ తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే డ్యూయల్ కెమెరా కలిగి ఉంటుంది.50 mp ప్రైమరీ కెమెరాతోపాటు..2MP సెకండరీ కెమెరా కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16 mp ఫ్రంట్ కెమెరా కలదు.

అలాగే ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.. కనెక్టివిటీ పరంగా 5.1 సపోర్టుతో పనిచేస్తుంది. టైప్ సి చార్జర్ ను కలిగి ఉంది.. ఈ స్మార్ట్ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే..5000 MAH సామర్థ్యంతో కలదు.అలాగే..44 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా పనిచేస్తుంది.8 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ గల మొబైల్ ధర రూ.16,999 అందుబాటులో కలదు ఈ మొబైల్ కేవలం రెండు రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నది. పలు రకాల EMI ఆఫర్లు కూడా కలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: