ఓవైపు రష్యా ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతూనే ఉంది. సుడాన్ లో రెండు వర్గాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్దం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు అన్ని ధరలు పెరిగి ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. ఎప్పటి నుంచో పాలస్తీనా, ఇజ్రాయిల్ కు సరిహద్దు గొడవలు జరుగుతున్నాయి. గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్ అడుగడుగునా చెక్ చేస్తారు. గాజా నుంచి తీవ్రవాదులు దాడులు చేసేందుకు వస్తున్నట్లు పసిగట్టిన ఇజ్రాయిల్ తీవ్ర వాదులు వస్తున్న బండిని డ్రోన్ల ద్వారా పేల్చేసింది.


ఇజ్రాయిల్ ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పసి గడుతుంది. పక్కా రక్షణ విధానాలు పాటిస్తుంది. డ్రోన్ల ద్వారా తీవ్ర వాద బండిని పేల్చేయడంతో పెద్ద విధ్వంసమే జరిగింది. దీంతో పాలస్తీనా కూడా మిస్సైల్స్ రెడీ చేసుకుంటోంది. ఇలా ఇజ్రాయిల్ కూడా యుద్ధానికి ఎప్పుడూ సిద్ధంగా నే ఉంటుంది. ఇప్పుడు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య యుద్దం వస్తే జరగబోయే పరిస్థితులు ఏమిటీ? ఎప్పటి నుంచో ఇరు దేశాల మధ్య సరిహద్దు గొడవలు ఉన్న కారణంగా ఇజ్రాయిల్ రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయిల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనది.


తమ శత్రుదేశం ఎవరితో మాట్లాడుతుంది. ఎలాంటి ప్లాన్ లు వేస్తుంది. తీవ్రవాదులు ఎటాక్ చేసే అవకాశం ఉందా అనే కోణంలో ఎప్పుడు నిఘా పెడుతూనే ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నిఘా విభాగం హెచ్చరికల నేపథ్యంలో ఇజ్రాయిల్ లోని నలుగురు పౌరులను చంపాలని దాడులు చేయాలని వస్తున్న తీవ్ర వాదుల వాహనాన్ని ఇజ్రాయిల్ పేల్చేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని పాలస్తీనా కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గల్ప్ లోని అన్ని ముస్లిం దేశాలు ఇజ్రాయిల్ పై యుద్దం చేసినా ఒంటరిగా పోరాడిన ఇజ్రాయిల్ తమ దేశ భూభాగాన్ని కాపాడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: