ఇకపోతే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ కారు చూడడానికి అసలు కారు లాగే లేదు. కానీ ఇది రోడ్డు మీద దూసుకుపోతుంది. ప్రత్యేకమైన డిజైన్ తో ప్రత్యేకమైన లక్షణాలతో తయారైన ఈ కారు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ కారు లేకుండా ముందుకు వెళ్లడానికి అసలు టైర్లే లేవంటే నమ్మండి. టైర్లు లేకపోయినప్పటికీ చదునైన రహదారిపై దానికదే కదులుతుంది ఈ కారు. దీంతో ఇక ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
అంతేకాదు ఎన్నో దిగ్గజ కారు కంపెనీలు కూడా మరోసారి ఆలోచనలో పడిపోయే విధంగా ఈ వినూత్నమైన ఆవిష్కరణ ఉంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన ఈ వీడియోలో చూసి నోరు తెరిచి కన్నారపుకుండా చూసేస్తున్నారు అందరూ. 9 సెకండ్ల నిడివి గలిగిన ఈ వీడియోలో రోడ్డుపై కారు కదులుతుండగా.. చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇటాలియన్ ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్ ఈ కారును తయారు చేశారు. అయితే ధ్వంసమైన పాత కారును ఉపయోగించి ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును తయారు చేశాడు సదరు వ్యక్తి. ఇక ఈ కారుకు ఒక కెమెరా కూడా అమర్చాడు. దీంతో ఈ కారు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా అడ్డంకులు ఉంటే అది ముందుగానే కనిపెట్టేందుకు వీలుంటుంది.