క్రమంలోని ఇప్పుడు 24 GB ram కలిగిన మొదటి ఫోను నుబియా యొక్క రెడ్ మ్యాజిక్ ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది అందరి అంచనాలను తారుమారు చేస్తూ నుబియా యొక్క ఈ రెడ్ మ్యాజిక్ ద్వారా కొత్త రెడ్ మ్యాజిక్ 8s ప్రో 24 జిబి రామ్ తో లోడ్ చేయబడుతోందని భావిస్తున్నారు. ఇక వరల్డ్ లోనే 24 జిబి రామ్ తో రాబోతున్న ఈ రకమైన ఫోన్లో ఇదే మొదటిది కావడం గమనార్హం. ఇక వర్చువల్ రామ్ ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యం అవుతుందా అని మీరు ఆలోచిస్తే పొరపాటే ఈ ఫోన్ నిజానికి 24 జీబీ ఫిజికల్ ర్యామ్ ను కలిగి ఉంటుంది.
భారీ ర్యామ్ సహాయంతో హెవీ ఎడిటింగ్ గేమింగ్ మల్టీ టాస్కింగ్ ఇలా అన్ని సులభంగా నేరుగా వేగంగా కూడా చేయవచ్చు సాధారణంగా ఫోన్లకు ఈ సామర్థ్యం అవసరమా లేదా కస్టమర్లను ఆకర్షించడానికి జోడించిన మరో పెద్ద సంఖ్య అనేది ఇప్పుడు మరింత ప్రశ్నగా మారింది. ఇదే స్టోరేజ్తో ఫోన్లను లాంచ్ చేయడానికి వన్ ప్లస్ రియల్ మీ అనే మరో రెండు బ్రాండ్లు కూడా సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక రెడ్ మ్యూజిక్ 8ఎస్ ప్రో ఇతర స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగా పిక్సెల్ అండర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో పాటు 18 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ని కలిగి ఉంటుంది.