మరింత సరసమైన మొబైల్ లను లాంచ్ చేయడానికి మరికొన్ని బ్రాండ్లు జియో తో కలిసి భాగస్వామ్యం అవుతాయని తాము ఆశిస్తున్నట్లుగా తెలియజేసింది జియో సంస్థ. దాదాపుగా వన్ మిలియన్ యూనిట్లను కలిగి ఉన్న మొదటి సెట్ జియో భారత్ మొబైల్స్ ఈనెల 7 నుంచి సేల్ ప్రారంభం కాబోతోందని తెలియజేశారు. దేశంలో ఉన్నటువంటి రిటైల్ స్టోర్ లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించడం జరిగింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ జియో భారత్ మొబైల్ ఫీచర్ ఫోన్ లాగా కీప్యాడ్ మరియు భారత్ బ్రాండింగ్ తో స్క్రీన్ దిగువన కనిపిస్తుందని తెలియజేస్తోంది.
అయితే ఈ ఫోన్ వెనకాల ప్యానల్ మరియు స్పీకర్లతో కెమెరా కూడా కలదట.. జియో భారత్ ఫోన్ భారతదేశంలో ఎక్కడైనా సరే అపరిమితమైన కాల్స్ చేసుకోవడానికి ఫోటోలు తీయడానికి జియో పే ని ఉపయోగించుకోవచ్చట. ఈ మొబైల్లో జియో సినిమా జియో సావన్, FM, మద్దతుతో అనేక వినోద కార్యక్రమాలు కూడా ప్రసారం కాబోతున్నాయట. ఇక రీఛార్జ్ ప్లాన్లను కూడా లాంచ్ చేయడం జరిగింది . రూ.123 ప్లాన్ చౌకైన దేవత లభిస్తుంది. ఆఫ్ జిపి డేటా 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది అపరిమిత కాల్చిన కూడా అందిస్తుంది. రూ.1234 ప్లాన్ ఏడాది మొత్తం లభిస్తుంది..168 GB డేటాను అందిస్తుంది అపరిమిత కాలింగ్ కూడా కలవట. ఈ మొబైల్ రెండు కలర్లలో లభిస్తుంది. దీని ధర రూ.999 కలదని సమాచారం.