వన్ ప్లస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ ప్లస్ నార్డ్ 3 5g స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. వన్ ప్లస్ సమ్మర్ ఈవెంట్ లో వన్ ప్లస్ నార్డ్ 3, వన్ ప్లస్ నార్డ్ సీ ఈ 3,వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2 ఆర్ ఇయర్ బర్డ్స్ లాంచ్ అవడం జరిగింది. ఇకపోతే వన్ ప్లస్ నార్డ్ 3 మొబైల్ ను రూ .35 వేల లోపు బడ్జెట్లో కంపెనీ విడుదల చేయడం జరిగింది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ తోపాటు 16 జిబి వరకు ర్యామ్ ఆమోలెడ్ డిస్ప్లే తో పాటు 5000 mah బ్యాటరీ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ యొక్క ఆఫర్లు, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ అన్ని వివరాలు ఇప్పుడు చదివి తెలుసుకుందాం.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే 8gb ర్యామ్ ప్లస్ 128gb స్టోరేజ్ వేరియంట్ కలిగిన వన్ ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్ విలువ రూ.33,999 ఇక 16 జిబి ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్ ఫోన్ ధర రూ.37,999.. ఇక జూలై 15వ తేదీ నుండి సేల్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ డేస్ సేల్లో మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.  ఇకపోతే అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా లభించే ఆఫర్లు ఈ స్మార్ట్ ఫోన్ పై వర్తిస్తాయి. టెంపెస్ట్ గ్రే , మిస్టీ గ్రీన్ వంటి కలర్స్ లో మనకు అందుబాటులో ఉంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో 6.74 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ అమౌలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. 50 మెగాపిక్సల్ సోనీ ఐమాక్స్ imx 890 ప్లస్ 8 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎస్ 355 అల్ట్రా వైడ్ లెన్స్ + 2 మెగాపిక్సల్ మైక్రో లెన్స్ లతోపాటు ట్రిపుల్ కెమెరా సెట్ అప్ కూడా ఉంది. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా అమర్చబడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: