అయితే ఇటీవల డ్రోన్ల ద్వారా కూడా పుడ్ డెలివరీ చేసే విధానం కొత్తగా వచ్చింది. అయితే తాజాగా గాలిలో తేలుకుంటూ వచ్చి పిజ్జా డెలివరీ చేశారు. ప్రపంచంలోనే ఇదే తొలిసారి అని చెబుతున్నారు. జెట్ సూట్ ద్వారా తొలిసారి పిజ్జా డెలివరీ చేశారు. జెట్ సూట్ వేసుకుని వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్ పిజ్జా డెలివరీ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. కొంతమంది దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గామారింది. భవిష్యత్తులో ఇలాంటి డెలివరీలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ జెట్ సూట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉండదని, త్వరగా ఫుడ్ డెలివరీ చేయవచ్చని చెబుతున్నారు.
డొమినెస్ సంస్థ ఈ జెట్ సూట్ డెలివరీ కోసం గ్రావిటీ ఇండస్ట్రీన్ అనే సంస్థలో డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఈ జెట్ సూట్లను డెలివరీ బాయ్స్ కు అందిస్తోంది. ఈ జెట్ సూట్ల సాయంతో సులువుగా, అత్యంత వేగంగా పుడ్ ను డెలివరీ చేయవచ్చు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా తొలిసారి ఈ జెట్ సూట్ డెలివరీని ప్రారంభించారు. ఇందుకోసం డెలివరీ బాయ్స్ కు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. డొమినోస్ భవిష్యత్తులో అన్ని దేశాల్లో ఈ జెట్ షూట్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.