ఇక రానున్న రోజుల్లో వర్షాకాలం రాబోతూ ఉండడం తో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడ దోమలు ఈగల సమస్య ఎక్కువగానే ఉంటుంది. వర్షాల కారణంగానే ఈగలు ఇంట్లోకి గుంపులు గుంపులుగా వస్తూ ఉంటాయి. దీంతో చాలా మందికి చికాకుగా అనిపిస్తూ ఉంటుంది.ఈగల తో పగులు పూట ఉండడమే కాకుండా రాత్రిపూట దోమలు కూడా మనుషుల రక్తాన్ని తాగుతూ ఉంటాయి. అయితే ఇందు కోసం పలు రకాలు మార్కెట్లో దొరికేటువంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాము. ఇక ఈ మధ్యకాలంలో సాంకేతిక రంగం చాలా అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పవచ్చు. మన స్మార్ట్ మొబైల్ చిన్న యాప్ ద్వారా దోమలని తరిమి కొట్టవచ్చట వాటి గురించి తెలుసుకుందాం.

కేవలం ఎలాంటి పని చేయకుండా దోమలను తరిమికొట్టేందుకు ఒక గార్డెన్ అందుబాటులోకి ఉన్నది. ఈ రోజుల్లో స్మార్ట్ మొబైల్ లో కూడా ఇటువంటి అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్లో వివిధ యాప్స్ అందుబాటులో కలవు. ఇలాంటివన్నీ దోమలను తరిమికొట్టేందుకు చాలా రకంగా సహాయపడతాయి.. మస్కిటో కిల్లర్, మస్కిటో సౌండ్ తదితర యాప్స్ ప్లే స్టోర్ లో మనం చూడవచ్చు. ఈ యాప్స్ లో విభిన్నమైన ఫ్రీక్వెన్సీ సౌండ్ ని ఉత్పత్తి చేసి ఈ సౌండ్ వల్ల దోమలను ఇంటిలో నుంచి తరిమికొట్టేలా సహాయపడతాయట.

ఈ శబ్దం వల్ల మానవులకు వినపడనంత తక్కువగా ఉంటుందట. కానీ డెవలపర్లు ఇది దోమలకు మాత్రం వినపడేలా డెవలప్మెంట్ చేసినట్లు తెలుస్తోంది.ఈ యాప్ ను చాలా మంది ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్  ను ఉపయోగించే విధానాలు రేటింగ్ కూడా చాలా వైవిధ్యంగా ఉన్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. దోమలతో విసిగిపోయి ఉన్నవారు మాత్రం ఈ యాప్ చాలా సౌకర్యంగా ఉపయోగపడుతుందని చెప్ప వచ్చు. అయితే ఈ యాప్ ను ఉపయోగించడం వల్ల కొంతమేరకు మంచి ఫలితం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: