మెటా యాజమాన్యంలో వాట్సప్ సంస్థ అనేక ఫీచర్లను సైతం తమ వినియోగదారుల కోసం తీసుకువస్తూనే ఉన్నది. పలు రకాల అప్డేట్లు రావడానికి కూడా పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది మెటా సంస్థ. ఇదంతా ఇలా ఉంటే యూజర్స్ అకౌంట్ సెక్యూరిటీ కోసం సరికొత్త కొన్ని ఫీచర్స్ ను సైతం ఉన్నప్పటికీ కొన్నిసార్లు వాట్సాప్ యాకయ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే అసలే యూజర్స్ వాట్సాప్ చాట్ పైన వేరొకరు వారికి తెలియకుండా ఈ సమాచారాన్ని చూడకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరిపోతుంది.


వాట్సాప్ ఖాతాను ఇతర పరికరాలలో మనం ఉపయోగించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అయితే మన ఖాతా ఎక్కడ లాగిన్ అయ్యిందో మనకు తెలియకపోతే వాట్సప్ ను ఎవరైనా చూస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకోవడం చాలా తక్కువ మంది మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సార్లు చేసే పొరపాటు వల్ల యూజర్ తమ వాట్సాప్ చాట్ మీడియా ఫైల్స్ ను ఇతరులు చూస్తూ ఉండే అవకాశం కూడా ఉంది. దీంతో వాట్సాప్ హ్యాక్ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయట. ఇలాంటి సమయాల్లోని ఎక్కువగా దుర్వినియోగం కూడా వాట్సాప్ అవుతుంది.

ఎవరైనా యూజర్ తమ వాట్సాప్ ని ఇతరులు రహస్యంగా చదువుతున్నారా తెలుసుకోవాలనుకునే వారికి ఇప్పుడు ఒక చిన్న ట్రిక్ వల్ల తెలుసుకోవచ్చట.. ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలి.. అప్పుడు కుడి వైపున కనిపించే మూడు చుక్కలను ఎంచుకోవలి.. ఆ తర్వాత అక్కడ కనిపించే వాట్సాప్ వెబ్ లింక్ డివైస్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.. అక్కడ మీ లాప్టాప్ లేదా డిస్క్ టాప్ వాట్సాప్ ని మీరు తెరవకపోయినా అక్కడ లింక్స్ చూపిస్తున్నాయి అంటే కచ్చితంగా మీ వాట్సాప్ చాటింగ్ ఎవరో చదువుతున్నారని గుర్తించవచ్చు . దీంతో వెంటనే ఆ లింకులను డిలీట్ చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: