అంతేకాదు అటు మనిషి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్స్ అయితే ఇంకా కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా మనిషి చేయాల్సిన ఎన్నో పనులను అటు మిషన్లే చేసేస్తూ ఉన్నాయి. దీంతో ఇలా టెక్నాలజీకి అలవాటు పడి సులభంగా పనులు చేసేందుకే ఇష్టపడుతున్నాడు మనిషి. అయితే ఇప్పుడు ఏకంగా మనిషి సెక్స్ కోరికలు తీర్చేందుకు కూడా రోబో రాబోతుంది అంటే నమ్ముతారా. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ.. ఇది నిజంగానే భవిష్యత్తులో జరగబోతుంది అన్నది తెలుస్తుంది.
ఇలా కృత్రిమ మేదస్సును వినియోగించుకొని నిత్య జీవితంలో ఎన్నో పనులను సులభతరం చేసుకున్న మనిషి.. ఇక ఇప్పుడు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో శృంగార కోరికలు కూడా తీర్చుకోపోతున్నాడట. సెక్స్ కోరికలు తీర్చేందుకు ఏఐ ఆధారిత రోగోలు వచ్చే ఛాన్స్ ఉందని గూగుల్ లో పనిచేసే మాజీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. భాగస్వామితో చేసినప్పుడు ఫిజికల్ గా కలిగే నిజమైన శృంగార భావననే ఈ రోబోలు కలిగిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. వర్చువల్ రియాల్టీ హెడ్ సెట్స్ తో ఫీలింగ్స్ కూడా పొందవచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఒకవేళ నిజంగానే ఇలాంటి రోబోలు అందుబాటులోకి వచ్చాయి అంటే చాలు ఇది మానవ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది అని చెప్పాలి.