స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వారు తమ మొబైల్ వేడెక్కుతోందా అంటే చాలా మంది అవుననే సమాధానాన్ని తెలియజేస్తున్నారు. కానీ వారు అందుకు గల కారణం ఏంటనే విషయం మాత్రం తెలియకపోవచ్చు. అయితే మొబైల్ వేడెక్కడానికి ప్రధాన కారణాలు ఉన్నాయట. అందులో కొన్ని పద్ధతుల ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని కొంతమంది టెక్నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.వాటి గురించి తెలుసుకుందాం.


మొబైల్ వేడెక్కేందుకు పరిసరాలలోని వాతావరణం కూడా ఒక కారణమట సూర్యకాంతి నేరుగా మొబైల్ పైన పడటం వల్ల మొబైల్ వేడెక్కి అవకాశం ఉంటుంది.


ఫోన్ ఉంచిన స్థలంలో అసలు గాలి లేకుండా ఉండడం వల్ల.. మొబైల్ బ్యాక్ పౌచ్ వల్ల సరిగ్గా పని చేయని బ్యాటరీ వల్ల కూడా మొబైల్ వేడెక్కడానికి ఒక కారణమట. అంతేకాకుండా మొబైల్లో గేమ్స్ వీడియోస్, వీడియో ఎడిటింగ్ వంటి రకరకాల యాప్లను ఉపయోగించడం వల్ల వీటి సమస్యల వల్ల కూడా ఒత్తిడి ఎక్కువై మొబైల్ వేడెక్కుతుందట.


సాఫ్ట్వేర్ లోని హార్డ్వేర్ సమస్యల వల్ల కూడా కొన్నిసార్లు మొబైల్ హీట్ ఎక్కే అవకాశం ఉంటుంది..ఇవి సరిగ్గా పనిచేయకపోతే ప్రాసెస్ కూడా పనిచేయదు దీంతో మొబైల్ వేడెక్కుతుంది.


స్మార్ట్ మొబైల్ పాతదైన తర్వాత కూడా వేడెక్కి అవకాశం ఉంటుంది మొబైల్ ని మూడు సంవత్సరాల పైగా వినియోగిస్తే చిన్న చిన్న పనుల వల్ల ఆ మొబైల్ వేడెక్కుతుంది.



మొబైల్ ని తరచుగా సర్వీసు చేయించడం చాలా మంచిది. ఇలా చేయించడం వల్ల మొబైల్ హీట్ ఎక్కకుండా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్డేట్లను సైతం తరచూ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల మొబైల్ పనితీరు వేగవంతంగా పనిచేస్తుంది.


స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వారిచ్చిన చార్జింగ్ లను మాత్రమే ఉపయోగించాలి.. ప్రస్తుతం ఉన్న కాలంలో ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తూ ఆ మొబైల్ ని అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న చార్జర్ ను వినియోగించడం వల్ల కూడా మొబైల్ చాలా హీట్ ఎక్కుతుందట.అందుచేతనే మొబైల్ ని తరచూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: