ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటుంది. స్మార్ట్ మొబైల్ లేని వారంటూ ఎవరు ఉండరు.వివిధ మొబైల్ తయారీ కంపెనీ సంస్థలు కూడా తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలలోనే స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకురావడం జరుగుతోంది. ప్రముఖ విదేశీ సంస్థ వివో ఈ రోజున ప్రపంచ మార్కెట్లో ఒకటిగా నిలుస్తోంది ఒక కొత్త స్మార్ట్ మొబైల్ ని విడుదల చేయడం జరిగింది.

ఇది కూడా స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో అందిస్తోంది ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన vivo y-100 స్మార్ట్ మొబైల్ ఇప్పుడు అతి చౌక ధరకే కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే లైట్ టచ్ మీద బ్యాక్ ప్యానెల్ రంగును మార్చేయడం.. ఈ స్మార్ట్ మొబైల్ 8 GB RAM+128GB స్టోరేజ్ తో కలదు.ఈ మొబైల్ ధర రూ.29,999 రూపాయలు ఉన్నది.. ఈ కామర్స్ ప్లాట్ఫాం అమెజాన్లో ఈ మొబైల్ పై 20% వరకు డిస్కౌంట్ను ప్రకటించింది..


దీంతో ఈ స్మార్ట్ మొబైల్ ఇప్పుడు రూ.23,999 రూపాయలకే లభిస్తోంది దీనితోపాటు ఎంపిక చేసుకున్న పలు రకాల బ్యాంకుల వల్ల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ మొబైల్ ఫిచర్స్ విషయానికి వస్తే..2400X1080 మెగా పిక్సెల్ తో కలదు..6.38 అంగుళాల అమౌండ్లు హెచ్డీ డిస్ప్లే కలదు. సూర్య కాంతి ఆధారంగా బ్యాక్ సైడ్ రంగు ప్యానల్ మారుతూ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరాతో 64 మెగా పిక్సెల్ సెన్సార్ ను కలిగి ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 16 మెగాపిక్సల్ కెమెరా కలదు. బ్యాటరీ విషయానికి వస్తే 44 W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 4500 MAH సామర్థ్యం కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: