ప్రస్తుతం వాట్సాప్ పది రకాల అప్డేట్లను సైతం కస్టమర్ల కోసం అందిస్తూనే ఉంది. త్వరలోనే వాట్సప్ గ్రూప్ ఛానల్ కూడా వాయిస్ చాట్ ఆప్షన్ ను కూడా ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. గ్రూప్ లోని సభ్యులలో ఎవరైనా సరే వాయిస్ చాట్ ను ప్రారంభించే అవకాశం కల్పించబడింది. గ్రూప్ లోని వ్యక్తులు ఎప్పుడైనా సరే అందులో చేరవచ్చు. స్టార్ట్ చేసిన తర్వాత అందరూ కూడా దాని నుంచి బయటకు వచ్చేస్తే 60 నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా అది కూడా కట్ అయిపోతుంది.

అంటే ఉదాహరణకు ఎవరైనా దానిని కట్  చేయకపోయినా సరే ఆటోమేటిగ్ గా అదే కట్ అయిపోతుంది. ఇక ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్స్ లోని వ్యక్తులు ఒకరితో ఒకరు ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ గురించిన సమాచారాన్ని వాట్సప్ డెవలప్మెంట్ ను పర్యవేక్షించే వెబ్సైటు wabetainfo షేర్ చేసింది. వాయిస్ చాట్ ఫీచర్ కింద కేవలం 32 మందిని మాత్రమే ఇందులో చేర్చుకునే అవకాశం ఉంటుంది.  ఇక ఏ గ్రూప్స్ లో కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది అనే సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేదు.

ఇకపోతే గ్రూప్స్ లో ఎంతమంది ఉంటే ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు అన్న విషయం కూడా ఇంకా క్లారిటీ లేదు. వాయిస్ చాట్ కి ?కాల్ కి  తేడా ఏంటి? అనే డౌటు చాలామందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దీని వల్ల ఉపయోగం ఏమిటి అంటే చేయాల్సిన అవసరం లేకుండానే వాయిస్ చాట్ మొదలు పెట్టవచ్చు. గ్రూప్లో ఉన్నవారికి కూడా ఒక నోటిఫికేషన్ వెళుతుంది. దాని ద్వారా ఈ వాయిస్ చాట్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాట్సాప్ లో ఇతర ఫీచర్ లు మాదిరిగానే ఈ ఫీచర్ కూడా ఎండ్ టు ఎండ్ ఎంక్క్రిప్ట్ చేయబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: