
హెరాన్ మార్క్ 2 డ్రోన్లు సుదూర తీరాలను కూడా లక్ష్యంగా చేసి కొట్టగలవట. అంతే కాకుండా ఈ డ్రోన్లు ఇతర ఆయుధ సంపత్తిని కూడా మోసుకెళ్లగలవని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లతో సరిహద్దు నిఘా వ్యవస్థ అనేది మరింత బలోపేతం కాబోతుందని అంటున్నారు అధికారులు. ఈ హెరాన్ మార్క్ 2 డ్రోన్లు ఎంతో శక్తివంతమైనవి మాత్రమే కాక గంటల తరబడి గాల్లో ఎగర గలిగే సామర్థ్యం కూడా వీటికి ఉందని అంటున్నారు.
అంతే కాకుండా సుదూర తీరాలను పసిగట్టగల కెపాసిటీ కూడా వీటికి ఉందట. కొన్ని రోజుల్లో పాక్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో నిఘా అనేది మరింత బలోపేతం అవ్వబోతుందని పంకజ్ రాణా అనే నిఘా అధికారి తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా కూడా ఈ డ్రోన్లు ఏకబిగిన 36 గంటలు పని చేస్తాయని తెలుస్తుంది. అంటే ఈ డ్రోన్లు ఒకేసారి చైనా మరియు పాకిస్తాన్ రెండు దేశాలను చుట్టేసి రాగలవు.
ఈ డ్రోన్లలో ఉండే లేజర్లు సుదూర తీరాలలో ఉండే లక్ష్యాలను కూడా పసికట్ట గలవు. దాంతో మన మిస్సైల్స్ ఆ స్థావరాలను ధ్వంసం చేయగలవు. ఎంతసేపైనా గాల్లో ఎగర గలగడం, ఎంత దూరంలో శత్రువుల లక్ష్యాలు ఉన్నా కూడా వాటిని పసి గట్టడం అనే లక్షణాలతో ఈ డ్రోన్లు ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టగలవు అని అంటారు. ఎలాంటి ప్రదేశంలో నైనా కూడా ఇవి పనిచేయగలవని తెలుస్తుంది.