అరచేతిలో ఉన్న మొబైల్ లోనే ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తున్న మనిషి బయట ప్రపంచంతో మాత్రం మనకేంటి పని అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా అరచేతిలో మొబైల్ ఉండాల్సిందే. చివరికి బాత్రూం కి వెళ్ళినా కూడా మొబైల్ తీసుకెళ్తున్న వారు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే చార్జింగ్ పెడుతున్న సమయంలో కూడా మొబైల్ వాడుతూ ఫోన్లు మాట్లాడటం చేసి చివరి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మొబైల్ వినియోగదారులకు ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది.
మొబైల్ ఛార్జింగ్ పెట్టి దాని పక్కనే పడిపోవడం చాలా ప్రమాదకరం అంటూ యాపిల్ వార్నింగ్ ఇచ్చింది. ఇక ఇలా చేస్తే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించ్చింది. చార్జర్ అడాప్టర్ ఫోన్ పై పడుకుని పొరపాటు చేయొద్దని.. వీటిని దిండు దుప్పట్ల వద్ద అస్సలు ఉంచవద్దు అంటూ సూచించింది. ఎప్పుడు గాలి వెళ్తూరూ ఉండే ప్రదేశాల్లో ఫోన్ చార్జర్ ను ఉంచితే మంచిది అంటూ తెలిపింది. మరి ముఖ్యంగా మొబైల్ ఛార్జింగ్ అవుతున్న సమయంలో ఫోన్ మాట్లాడటం ఇంకా ప్రమాదకరం అంటూ హెచ్చరించింది. ఇక థర్డ్ పార్టీ చార్జర్ సహాయంతో ఐఫోన్‌కు చార్జింగ్ చేయడానికి వీలవుతుందని.. ఇలా ఇతర చార్జర్ ను ఉపయోగించి ఐఫోన్లు చార్జింగ్ చేస్తే మాత్రం మరింత ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించింది యాపిల్ కంపెనీ.