గతంలో ఏదైనా ఇబ్బందితో డాక్టర్ వద్దకు వెళితే ఆ వైద్యుడి చేయి పట్టుకుని మనలోని ఉన్న రోగం ఏమిటో చెప్పగల సామర్థ్యం ఉండేది. దాని తర్వాత దానికి కావాల్సిన మందులను వాడితే తగ్గిపోతుందని చెప్పేవారు. ఆయా కొన్ని కోర్సులు ఇచ్చేవారు. పేషంట్లతో తీరిగ్గా మాట్లాడేవారు. అలా పేషంట్లకు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు సాగేవారు. కానీ ప్రస్తుతం హాస్పిటల్ వెళితే చాలు టెస్టుల పేరుతో ఎంఐఆర్ఐ స్కానింగ్ పేరుతో పేషంట్ల జేబులు ఖాళీ చేస్తున్నారు. తలనొప్పి అని వెళ్లినా కూడా స్కానింగ్ తీయించడం స్కానింగ్ చేయించడం పరిపాటిగా మారిపోయింది.


విదేశాల నుంచి కోట్ల రూపాయలు పెట్టి వాటిని తీసుకురావడం తర్వాత ఆయా డబ్బులను రికవరీ చేసుకోవడం కోసం వచ్చిన ప్రతి పేషెంట్ కు స్కానింగ్ రాయడం అలవాటుగా మారిపోయింది.  ఇది రోజురోజుకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పెరిగిపోతుంది. ఇలా ప్రతి ఆసుపత్రిలో ఇలా ఎంఆర్ఐ స్కానింగ్ తో ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.


అయితే ట్యాక్సులతో సహా కట్టి విదేశాల నుంచి స్కానింగ్ మిషన్లను తీసుకొస్తున్నారు. దీంతో వైద్యం వ్యాపారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎంఆర్ ఐ స్కానర్లను విదేశాల నుంచి కొనుగోలు చేయడం కాకుండా ఇండియాలోనే తయారు చేసేందుకు కొన్ని విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. విశాఖ లోని మెడి హబ్ లో తయారు చేయడానికి బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ముందుకొచ్చింది. ఆత్మనిర్బర్ భారత్ ద్వారా దేశంలోనే తయారీ విధానం నినాదంతో ఎంఐఆర్ స్కానింగ్ మిషన్లను తయారు చేయనున్నారు.


అందులో భాగంగా ఎంఆర్ఐ స్కానర్ల తయారీలో హీలియం ఉపయోగించే వారు. అయితే ఈ తయారీ వల్ల స్వదేశీ విధానం వల్ల ఎంఆర్ఐ స్కానర్ల రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది. దీంతో ఫైనల్ గా ప్రజలకు టెస్టులు చేసేటపుడు ఖర్చు తగ్గనుంది. మరి ఆత్మనిర్బర్ భారత్ తో ఒక ప్రయోజనం అయితే కలగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

MRI