టెలికాం రంగంలో జియో వచ్చిన తర్వాత రకాల సంచలనాలు మొదలయ్యాయి.. ముఖ్యంగా జియో నెట్వర్క్ దెబ్బకు అన్ని కంపెనీలు కూడా ఒకసారిగా డౌన్ అయిపోయాయి.. అతి తక్కువ ధరకే డేటా వినియోగదారులకు అందిస్తున్నాయి.. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటి లు ఎక్కువగా ప్రజలకు చేరువయ్యాయి.. ప్రజలు ఇప్పటికీ ఓటీటి లను బాగానే ఆదరిస్తున్నారు.. అందుకోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు కూడా టెలికాన్ సంస్థలు తీసుకొస్తున్నాయి. అయితే ఓటీటి రీఛార్జిలు సెపరేట్ గా చేసుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో పెను బారంగా మారుతున్నాయి. అందుచేతనే ఈ నేపథ్యంలోనే కాస్త ఊరట కలిగిస్తూ జియో ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ తో జతకట్టి రీఛార్జి ప్లాన్స్ ను సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా నెట్ ఫ్లిక్స్ ను ఒక కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రకటించింది. వాటి గురించి తెలుసుకుందాం.


Jio -net flix: రూ.1099:
ఈ రీఛార్జి ప్లాన్ 84 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది.. రూ.149 విలువైన నెట్ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ఉచితంగా అందిస్తుంది. అదనంగా వెల్కమ్ జియో ప్లాన్ తో 5జిపి డేటా కూడా లభిస్తుంది.. రోజువారి డేటా 2gb డేటాగా లభిస్తుంది.


రూ.1400 ప్లాన్:
ఈ ప్లాన్ వాలిడేటి 84 రోజులు .. నెట్ఫ్లిక్స్ రూ.199 రూపాయలు కలిగిన వాటిని ఉచితంగా అందిస్తుంది జియో వెల్కమ్ ఆఫర్ కింద అపరిమితంగా 5 జిబి డేటాను కూడా పొందవచ్చు.. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్ తో రోజుకి..3Gb డేటా కూడా వినియోగించుకోవచ్చు జియో మినహా మరి ఇతర టెలికాన్ కంపెనీ ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడం లేదు ఈ డీల్ ద్వారా పలువురు సబ్స్క్రిప్షన్లు నెట్ ఫ్లిక్స్ జియో ప్రీపెయిడ్ కస్టమర్లను పెంచుకునేందుకు ఇలా మార్కెట్లోకి పలు రకాల ప్లాన్స్ ను విడుదల చేసినట్లు తెలుస్తోంది . మరి రాబోయే రోజుల్లో పలు రకాల ఓటీటి సంస్థలను కూడా తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తుంది జియో సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: