అయితే ఇటీవల కాలంలో లిఫ్ట్ వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో యువకుల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎవరు మెట్లు ఎక్కడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అదే సమయంలో ఇక ఇటీవల కాలంలో పది, 15 ఫ్లోర్ల భవనాలే ప్రతి చోట కనిపిస్తూ ఉండడంతో అన్ని ఫ్లోర్లు మెట్లు ఎక్కడానికి కూడా కాస్త భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే లిఫ్ట్ వాడకం మరింత పెరిగిపోయింది. అయితే కొన్ని కొన్ని సార్లు లిఫ్టుల్లో ప్రయాణిస్తున్నప్పుడు సడన్గా సాంకేతిక సమస్యలు ఏర్పడి లిఫ్టులు ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓవర్ లోడ్ అయితే కేబుల్స్ విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇలా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి ఇలా లిఫ్ట్ ఆగిపోయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. లిఫ్ట్ ఆగిపోయినప్పుడు తెలియకుండా అందులో ఉన్న లైట్స్ ఆన్ లేదా ఆఫ్ చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో స్టాక్ బటన్ ఉపయోగించాలీ. కంగారు పడకుండా అలారం బటన్ నొక్కితే క్షణాల్లో సహాయం అందుతుంది. బలవంతంగా లిఫ్ట్ తలుపు తెరవడానికి ప్రయత్నించకూడదు. మూసుకుంటున్న లిఫ్టు తలుపులను చేతులు పెట్టి ఆపడానికి ప్రయత్నిస్తే చివరికి సెన్సార్ పని చేయకపోతే చేతులు మధ్యలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఇక పిల్లలతో లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు వారు ఎలాంటి బట్టన్ లు నొక్కకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.