ఇటీవల కాలంలో సోషల్ మీడియా అనేది వినూత్నమైన క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో తమలో ఉన్న క్రియేటివిటీని నిరూపించుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో కాస్త కొత్తగా ఆలోచించి ఏదైనా చేస్తే చాలు అనుకున్న దాని కంటే ఎక్కువగానే పాపులారిటీ వస్తుందని అందరూ నమ్ముతూ ఉన్నారు. ఇంటర్నెట్లో ఇప్పుడు ఎన్నో రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక కొన్ని కొన్ని వీడియోలు చూస్తే నేటిజెన్లకు ఆశ్చర్యం కలగక మానదు. ఇక వారి క్రియేటివిటీ ముందు పెద్ద పెద్ద ఇంజనీర్లకు కూడా బలాదూర్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ కుర్రాడు మెకానిక్ ఇక ప్రతిరోజు తన దగ్గరికి వచ్చే వాహనాలను రిపేర్ చేస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ మెకానిక్ యువకుడు తెలివికి ఇంజనీర్లు సైతం సాటిరారు అనే రేంజ్ లో ఒక సరికొత్త పరికరాన్ని తయారు చేశాడు. అతను వాహనాలను రిపేర్ చేసేటప్పుడు.. అతనికి అనువుగా ఉండేలా ఒక కుర్చీని తయారు చేసుకున్నాడు.



 అదేంటి కుర్చీని తయారు చేసినందుకు ఇంతలా పొగడాల అనుకుంటున్నారు కదా. కానీ ఈ కుర్చీని చూసిన తర్వాత మాత్రం కచ్చితంగా పొగడటం అవసరమే అని మీకే అనిపిస్తుంది. అయితే ఈ కుర్చీ ఇనుముతోనో లేకపోతే చెక్కతోనో తయారు చేసింది కాదు. కేవలం బైక్ విడిభాగాలతో అతను తనకోసం ఈ కుర్చీని తయారు చేసుకున్నాడు. బైక్ లోని డిస్క్, బ్రేకులు, సస్పెన్షన్ వంటివి వాడి కూర్చిని సిద్ధం చేసుకున్నాడు. బైక్ ని రిపేర్ చేస్తున్న సమయంలో అతనికి కూర్చోవడానికి  వీలుగా ఉండేలా దాని డిజైన్ చేసుకున్నాడు. అయితే అతని మెకానిక్ షాప్ కి వచ్చిన కస్టమర్లు ఇది చూసి షాక్ అయ్యి వీడియో తీసే సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: