కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం అలా అనుకోలేదు. అతను అతి తక్కువ ధరతోనే ఒక కార్ ను కొనుగోలు చేశాడు. అయితే రోల్స్ రాయిస్ కొనుగోలు చేయాలనే కలను ఆ కారుతోనే తీర్చుకున్నాడు. ఏకంగా తన కారుని అతి తక్కువ ఖర్చుతో రోల్స్ రాయిస్ తరహా కారును తరహాలో తయారు చేసుకున్నాడు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. మనిషి అనుకుంటే కానిది ఏమున్నది అన్న విషయాన్ని ఈ యువకుడు నిరూపించాడు. కేరళకు చెందిన 18 ఏళ్ల హదీప్ అనే యువకుడు తన నైపుణ్యాలతో రోల్స్ రాయిస్ తరహా ఒక కారును రూపొందించాడు.
సాధారణ కార్ నే లక్సరీ కార్లుగా మార్చాలి అనే ఆసక్తి అతనిలో ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఈ ఆలోచనని ఆచరణలో పెట్టాడు. చివరికి సాధించాడు. మారుతి 800 కారును ఏకంగా లగ్జరీ కారుగా మార్చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇలా మారుతీ కారును లగ్జరీ కారుగా మార్చేందుకు అతను ఈ తీవ్రంగా శ్రమించాడు అని చెప్పాలి. కాగా కొత్తగా ఆవిష్కరించిన ఈ కారుకు ఉన్న అద్దాలు చక్రాలు హెడ్లైట్స్ సహా అన్ని భాగాలను అందంగా మలిచాడు. అంతేకాదు ఈ కారు పై ఉన్న లోగోను కూడా అతని రూపొందించడం గమనార్హం.