చందమామ దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ని సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది.  జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ అద్భుత విజయాన్ని సమస్త భారతావని వేడుకలా నిర్వహించింది. అంతే కాదు ప్రపంచ దేశాలు సైతం జయహో భారత్ అని కీర్తించాయి.


విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు వెల్లడించే అనూహ్య, అద్భుత విషయాలు వెల్లడించింది. అక్కడ 14 రోజులు మాత్రమే సూర్యుడి కిరణాలతో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్రాంతం అంధకారంగా మారిపోతుంది. అందుకే  ఈ మిషన్ లైఫ్ టైమ్ 14 రోజులే. ఇది అక్కడ ఉన్న మూన్ జియాలజీ, నీటి వనరులు, భవిష్యత్తులో మానవుల అన్వేషణలకు  నీటి వనరు తదితర సమాచారాన్ని ఇప్పటికే అది చేరవేసింది. అప్పటి వరకు చంద్రుడిపై చక్కర్లు కొట్టిన ప్రగ్యాన్ రోవర్లు 14 రోజుల తర్వాత నిద్రలోకి జారుకుంది. మన లక్ష్యం కూడా అదే. అది నెరవేరింది.


మళ్లీ సెప్టెంబరు 22న అవి మేల్కొని మళ్లీ పరిశోధనలు సాగించాలని శాస్త్రవేత్తలతో పాటు యావత్  ప్రపంచం కోరుకుంది. అక్కడ మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది కాబట్టి అంత శీతల వాతావరణంలో వ్యోమ నౌకల్లోని కొన్ని లోహ భాగాలు పెళుసుబారి అవి శాశ్వతంగా దెబ్బతిని ఉండొచ్చు.  


ఇస్తో శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే.. ఇది ఒక్కసారి మాత్రమే ల్యాండ్ అయ్యేలా చూశాం.  విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది. ప్రగ్యాన్ రోవర్ బయటకి వచ్చింది. ఫలితాలను పంపించింది. ఇదే సమయంలో అదనపు పని కూడా చేసింది. ఒక్కసారి ల్యాండ్ అయ్యాక మరోసారి రోవర్ ను తీసుకొని అవతలకి తీసుకెళ్లే క్రమంలో నాలుగు అడుగులు పైకి లేచి.. ల్యాండ్ చేసింది.  అంటే ఒక్క వ్యవస్థ రెండు సార్లు పనిచేసింది. ప్రపంచ చరిత్రలో ఇది ఏ దేశానికి సాధ్యం కాలేదు. ఇది భారత్ సాధించిన ఘనత అని సగర్వంగా ఇస్రో శాస్త్రవేత్తలు చాటి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: