ప్రస్తుతం సోషల్ మీడియాకు యూత్ లో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు.కాస్త సమయం దొరికినా చాలు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. చేతిలో ఫోన్ అందుబాటులో  ఉంటే చాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు.ఇక సోషల్ మీడియా లోని ప్లాట్ఫారం లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ యాప్లను చాలామంది కూడా వాడుతుంటారు. అయితే తాజాగా ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్ ల గురించి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది.అయితే ఇకపై ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ లు ఫ్రీ కాదట. ప్రతి నెల 3000 చెల్లించాల్సి ఉంటుందట. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ల మెటా సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్లాట్ఫారంలలో యాడ్స్ సదుపాయం అందించేందుకు వినియోగదారుల నుంచి నెలకు 40 డాలర్లు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది.


యూరప్ వినియోగదారులకు ఈ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు ప్లాట్ఫారం లకు కలిపి మొత్తం 15 డాలర్ సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని అందించనుంది. వినియోగదారుల సమ్మతి లేకుండా యూరప్ లో నిర్దేశిత ప్రకటనలు కోసం వ్యక్తిగత డేటా ను మెటా ఉపయోగించడం గురించి యుయు నియంత్రికుల ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ప్రతిస్పందనగా ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇక యూరోపియన్ వినియోగదారులకు మూడు ఆప్షన్లను ఇవ్వనుంది మెటా సంస్థ. ఒకటి ప్రకటనలు లేకుండా వినియోగించడం కోసం చెల్లించడం, రెండు వ్యక్తిగత ప్రకటనలతో ఈ రెండు ప్లాట్ఫారంలను ఉపయోగించుకోవడం ఇంకా మూడు ఎకౌంట్లను క్లోజ్ చేయడం అంటే దీని అర్థం సబ్స్క్రిప్షన్ తప్పనిసరి అని మెటా యుయు ప్రకటనలో ఈ యాప్ల ఫ్రీ వర్షన్ లను అందించడం కూడా కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: