చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే .చంద్రయాన్ 3 అనుకున్న దాని కంటే ఎక్కువ పని చేసిందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. చంద్రుడిపై 14 రోజులు ఉదయం ఉందనగా అక్కడ ల్యాండ్ అయినా విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా పనిచేసింది. దానిలోని ప్రగ్యాన్ రోవర్ కూడా బయటకు వచ్చి తన పని సక్రమంగా చేసి భూమిపైకి చంద్రుడి నుంచి వివిధ రకాల పరిశోధనలు చేసి పంపించింది. దీంతో చంద్రయాన్ 3 గ్రాండ్ సక్సెస్ అయినట్లు సైంటిస్టులు ప్రకటించారు.


రాత్రి అయ్యే ముందు విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లను షట్ డౌన్ చేసి మళ్లీ సూర్యోదయం వచ్చాక మేల్కోల్పలని  భావించారు. అయితే ఇది కేవలం 14 రోజుల కు మాత్రమే పంపిన మిషన్ అని.. ఒక వేళ మేల్కోంటే అది అదనపు విజయం అవుతుందని అన్నారు. 14 రోజుల చీకటి అనంతరం అక్కడ మళ్లీ విక్రమ్ ల్యాండర్ ను నిద్రలోంచి లేపాలని ప్రయత్నాలు చేశారు.


కానీ అది ఎంతకీ నిద్ర నుంచి బయటకు రాలేదు. ఇస్రోకు విక్రమ్ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. చంద్రుడి మీద విలువైన ఖనిజాలు ఉన్నట్లు తెలిపారు. అయితే విక్రమ్ ల్యాండర్, రోవర్ లను నిద్ర నుంచి లేపాలని ఎంత ప్రయత్నం చేసినా.. అవి మేల్కోలేవని ఇస్రో సైంటిస్టులు పేర్కొన్నారు.


నిద్రాణ స్థితి నుంచి మేల్కోవాల్సి వస్తే ఇప్పటికే అవి సోలార్ ప్యానళ్ల ద్వారా రెఢీ అయ్యేవని అన్నారు. మళ్లీ చీకటి కమ్ముకొస్తున్న వేళ ఇక అవి పూర్తిగా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయేనట్లేనని ప్రకటించారు. చంద్రయాన్ 3ను విశాల దృక్పథంతో చూసినపుడు అనుకున్న దాని కంటే ఎక్కువగానే సక్సెస్ అయిందని చెప్పారు. ప్రపంచంలో ఎవరూ కాలు మోపలేని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపి భారీ విజయం సాధించడం గ్రేట్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: