ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి వద్ద కూడా స్మార్ట్ మొబైల్ కచ్చితంగా ఉండనే ఉంటోంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎక్కువగా స్మార్ట్ మొబైల్ తోనే గడిపేస్తూ ఉన్నాము.. అలాగే ఉద్యోగస్తులకు కూడా స్మార్ట్ మొబైల్ అనేది కచ్చితంగా ఉండాల్సిందే అనేంతగా మారిపోయింది. అయితే చాలామంది స్మార్ట్ మొబైల్ తీసుకున్న తర్వాత దాని గురించి పెద్దగా పట్టించుకోరు.. ఎందుకంటే స్మార్ట్ మొబైల్ యాక్టివ్గా మనకి ఉపయోగకరంగా ఉంటుంది.. ముఖ్యంగా మొబైల్ కి ఉండే కెమెరా పలు రకాల సెల్ఫీ ఫోటోలను సైతం మనం దిగుతూ ఉంటాము.
ప్రస్తుతం మార్కెట్లో 200 మెగాపిక్సల్ కెమెరా స్మార్ట్ మొబైల్స్ కలిగి ఉన్నాయి. అయితే ఈ కెమెరా ఫోన్లు చాలా సార్లు ఫోటో తీయగానే బ్లర్ గా కనిపిస్తూ ఉంటుంది. అందుకు కారణం కెమెరాను మరింత మెరుగ్గా పరుచుకునేందుకు సైతం పలు రకాల చిట్కాలను కచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్ లెన్స్ ని చాలాసార్లు శుభ్రం చేయకుండా ఉంటారు.. పెద్దగా వీటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంతో ఉంటారు. దీంతో ఇందులో ఉండే దుమ్ము పేరుకుపోయి దీని కారణంగా అనేక సమస్యలు కనిపిస్తూ ఉంటాయి.. లెన్స్ మురికిగా ఉంటే మైక్రో ఫైబర్ క్లాత్తో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి.
మనం చీకటిలో లేదా మసక వెలుతురులో ఫోటోలను తీస్తే ఆ ఫోటోలు ఆస్పష్టంగా వస్తాయి.. దీంతో మీరు ఫోటోని క్లిక్ చేసినప్పుడే కాంతి ఉపయోగించడం మంచిది.
మొబైల్ కెమెరా సెట్టింగ్లను తనిఖీ చేయండి అప్పుడప్పుడు కెమెరా యాప్ ను తెరిస్తే రీస్టార్ట్ కెమెరా అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తూ ఉండాలి. ముఖ్యంగా నైట్ మోడ్ లేదా ప్రో మోడ్ అనే ఆప్షన్ పైన ఉంచడం వల్ల ఫోటోలు బాగా వస్తాయట.
కెమెరా లెన్స్ మీద గీతలు పడకుండా ఉండేందుకు బయట చాలా రకాల గ్లాసెస్ దొరుకుతున్నాయి వాటిని ఉపయోగించడం మంచిది.