అయితే ఇది ఈ సిమ్ కార్డుతో పనిచేస్తుందట. వైఫై హాట్స్పాట్ వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో అదిరిపోయే ఫీచర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. జియో మోటివ్ డివైస్ ను కారులోని..OBD పోర్టుకు సైతం కనెక్ట్ చేస్తే చాలట. కారుకి సంబంధించిన సమాచారాన్ని సైతం ఎప్పటికప్పుడు మొబైల్ కి సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఇందులో ఫీచర్స్ విషయానికి వస్తే.. జియో మోటివ్ తో కారు మరింత స్మార్ట్ గా మారుతుందట. కారు లోపల ఉండే ప్రాబ్లమ్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది ఈ జియో మోటివ్.
ముఖ్యంగా బ్యాటరీ వోల్టేజ్, ఇంజన్ టెంపరేచర్ ట్రాక్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ ఆధారంగా సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యేలా చేస్తూ ఉంటుంది.ఓవర్ స్పీడ్, యాష్ బ్రేకింగ్ వంటి సందర్భాలలో డ్రైవర్లను కూడా హెచ్చరిస్తుందట ఈ జియో మోటివ్.. జియో థింగ్స్ యాప్ సహాయంతో వీటిని వినియోగించుకోవచ్చు. అయితే కారు భద్రతను పెంచే ఈ స్మార్ట్ పరికరం ధర 5000 రూపాయలుగా ఉన్నది. ఒక ఏడాది పాటు ఫ్రీగా ఈ సేవలు అందించిన ఆ తర్వాత నుంచి 600 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలని జియో సంస్థ తెలియజేస్తోంది. ఈ పరికరం కావాలి అంటే జియో మార్క్ రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చట.