మామూలుగా మనం శీతాకాలంలో ఎక్కువగా నీరు చల్లగా ఉండడంతో వేడి నీటిని సైతం మనం ఉపయోగిస్తూ ఉంటాము ఒకప్పుడు కట్టెలపోయే మీద నీటిని వేడి చేసుకునే వారము.. కానీ ఈ మధ్య గ్రీజర్, హీటర్స్ వంటివి రావడం వల్ల అలాంటి కనుమరుగు అయిపోయాయి.. ప్రస్తుత కాలంలో ఎక్కువమంది గ్యాస్ స్టవ్ మీద కూడా నీటిని వేడి చేసుకుంటున్నారు. తరచూ ఈ మధ్యకాలంలో హీటర్ కారణంగా చాలామంది చిన్నారుల సైతం ప్రాణాలను వదిలేయవలసి వస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.


అయితే మనలో చాలామంది వేడి నీటి కోసం కాపర్ రాడ్డును కలిగి ఉన్నటువంటి హీటర్ను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా చేస్తున్న సమయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వ్యవహరిస్తూ ఉండాలి చలికాలంలో చల్లని గాలుల వల్ల నీరు చాలా చల్లబడుతూ ఉంటుంది. ఒకవేళ ఉదయం పూట స్నానం చేయవలసి వస్తే వేడి నీటిని కచ్చితంగా ఉపయోగించుకుంటూ ఉంటాము. గీజర్లు ఉన్నవారు సులభంగా ఈ వేడి నీటిని పొందుతారు. అయితే చాలామంది హీటర్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే హిటింగ్ రాడు లేదా ఇమర్శషన్ రాడును ఉపయోగించడం పై కొన్ని ప్రత్యేక శ్రద్ధ వ్యవహరిస్తూ ఉండాలి.


 హీటర్ను గాని మరే ఇతర వాటిని కానీ స్నానం చేసేటువంటి గదిలో అసలు ఉంచకూడదు.. ఇవి మ్యానువల్ గా పనిచేస్తాయి.. ఆటో స్విచ్ ఆఫ్ ఆప్షన్ వీటిలో అసలు ఉండదు అందువల్ల దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవడమే ముఖ్యము. హీటర్ను సైతం నీటిలో పూర్తిగా ముంచిన తర్వాతే ఆన్ చేయాలి. నీరు వేడెక్కుతున్నాయో లేదో తెలుసుకోవడానికి అందులో వేలు పెట్టకూడదు. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే ఆ హీటర్ను బయటికి తీసిన తర్వాతే నీటిని చెక్ చేసుకోవాలి. హీటర్ ఆఫ్ చేసిన వెంటనే కనీసం ఓ పది సెకండ్ల పాటు అయినా పక్కన పెట్టడం మంచిది. నాణ్యతలేని హీటర్లను సైతం ఉపయోగించకూడదు. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. హీటర్ తో నీరు కాచుకునేవారు ప్లాస్టిక్ బకెట్లను ఉపయోగించడమే సురక్షితం. ఇతర వాటిని ఉపయోగిస్తే కాయలు కాలిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు వీటిని దూరంగా ఉంచడమే చాలా మంచిదట.

మరింత సమాచారం తెలుసుకోండి: