చాలామంది స్మార్ట్ మొబైల్ ని ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు.. స్మార్ట్ మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. దాదాపుగా ఎలాంటి విషయాలనైనా సరే మొబైల్ ద్వారా అని ప్రతి ఒక్కరు సులభంగా షేర్ చేసుకుంటూ ఉంటున్నారు.మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేకపోతే వీడియోలు కానీ గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా ఈ మొబైల్ లోకి పలు రకాల యాడ్స్ సైతం వస్తు ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది. అయితే వీటిని బ్లాక్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.


ఈ యాడ్స్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందట. ఈ పరిస్థితిని చాలామంది యూజర్స్ ఎదుర్కొంటూ ఉంటారు. అయితే అత్యవసరాల సమయాలలో మొబైల్ ఉపయోగించేటప్పుడు ఈ యాడ్స్ వస్తే కొన్నిసార్లు విసుగు తెప్పించడమే కాకుండా కోపం కూడా వస్తుంది.. కానీ ఆపిల్ ఐఫోన్ మొబైల్స్లలో మాత్రం ఇలాంటి ప్రకటనలు ఎక్కడ కనిపించవు కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్ లో మాత్రమే ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి.. యూట్యూబ్ ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా ప్లాట్ఫారం లోని ప్రకటనలను కూడా ఆపడానికి ఆప్షన్ ని ఎంచుకోవచ్చట.


చాలామందికి ఆండ్రాయిడ్ మొబైల్స్ లో ప్రకటనలు కనిపిస్తే ఏం చేయాలో తెలియకపోవచ్చు. అయితే ఇప్పుడు మొబైల్ లో వచ్చే యాడ్లను సులభంగా బ్లాక్ చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

 ముందుగా మొబైల్లో సెట్టింగ్ ని ఓపెన్ చేసి.. ఆ తరువాత గూగుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.. ఆ తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.. అక్కడ కాస్త స్క్రోలింగ్ చేస్తే personalized ads అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ my ad centre అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి.. ఇక అక్కడే కుడివైపున ఒక బటన్ ఆఫ్ చేయాలి.. ఆ తర్వాత వెంటనే సెట్టింగ్ ఓపెన్ చేసి గూగుల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.. ఆ తర్వాత డివైస్ సెక్షన్లోకి వెళ్లి యాడ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి..ఆ వెంటనే డిలీట్ అడ్వెస్టింగ్ ఐడి అని టాప్ చేసి డిలీట్ చేయాలి. దీనివల్ల ఇకమీదట ఆండ్రాయిడ్ మొబైల్స్ లో యాడ్స్  ఆగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: