ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసెంజర్ యాపులలో వాట్సప్ కూడా ఒకటి.. ఈ యాప్ లో నుంచి మెసేజ్లు ఫోటోలు వీడియోలను సైతం పంపించేందుకు పలు రకాల ఫీచర్స్ సైతం వాట్సాప్ తీసుకు వస్తూనే ఉంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్ ను మరింత మెరుగు దిద్దే విధంగా ప్రయత్నిస్తూనే ఉంది వాట్సాప్ సంస్థ.. వాట్సాప్ ద్వారా టెక్స్ట్ మెసేజ్ లు, వాయిస్ కాలింగ్, స్టిక్కర్ ఫోటోలు వీడియో అప్లోడ్ వంటివి ఇతర ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి.అయితే వాట్సాప్ లో ఇప్పటివరకు కేవలం ఒకరిని బ్లాక్ చేస్తున్నారంటే దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చని చెప్పవచ్చు



అయితే ఇలా ఒక్కసారి బ్లాక్ చేశారంటే చాలు మనకు సంబంధించిన ఎలాంటి విషయాన్ని కూడా వారికి అనుమతి లేదని అర్థము.. కొన్నిసార్లు ఫోటోలు వీడియోలను ఇతర సమాచారాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదని పిస్తూ ఉంటుంది.ఇలాంటి వ్యక్తులను బ్లాకింగ్ చేస్తూ ఉంటాము. అయితే ఒక వ్యక్తిని బ్లాక్ చేసినప్పటికీ స్టేటస్ లో నుంచి బ్లూ టిక్స్ చాటింగ్ పూర్తిగా ముగించడం ప్రొఫైల్స్ ఎవరు చూడకుండా ఉండడం ఇలా అన్నిటికీ కూడా అనేక మార్గాలు ఉన్నాయట.


నెంబర్ బ్లాక్:

మొదటిది నెంబర్ బ్లాక్ చేయడం ఒక వ్యక్తి నెంబర్ ని బ్లాక్ చేస్తే వారి నుంచి ఎలాంటి ఫోటోలు వీడియోలు మెసేజ్లు వెళ్ళవు.

లాస్ట్ వ్యూ బ్లాక్: ఇది బ్లాక్ చేయడం వల్ల వాట్సప్ లో మనం లాస్ట్ వ్యూ ను ఆన్లైన్లో ఉన్నామా లేదా అనే విషయాన్ని చూడలేరు.

వాట్సాప్ స్టేటస్ బ్లాక్:
ఎవరైనా వాట్సాప్ స్టేటస్ నుంచి బ్లాక్ చేసినట్లు అయితే వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అసలు చూడలేరు.

ప్రొఫైల్ బ్లాక్:
ఈ ప్రొఫైల్ బ్లాక్ చేయడం వల్ల యూజర్స్ మిమ్మల్ని ప్రొఫైల్ ఫోటో సెట్టింగ్ లో నుంచి బ్లాక్ చేశారని అర్థము. దీనివల్ల ఆ బ్లాక్ చేసిన వ్యక్తికి సంబంధించి ఫోటోలని అసలు చూడలేరు. కేవలం కొంతమందికి మాత్రమే ఇది కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: