
ఈ ఎలక్ట్రిక్ బైక్ కొనేవారికి ఏకంగా 19 వేల రూపాయల భారీ డిస్కౌంట్ సైతం ప్రకటించింది.. దీంతో ఈ స్కూటర్ అసలు ధర.. 97000 కాగా ఇందులో 19 వేల తగ్గింపుతో 78 ,000 వేల రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని కంపెనీ అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ బ్రాండ్ కు సంబంధించి డిస్కౌంట్ విషయంలో ఎప్పటి వరకు ఉంటుందనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు..EV కోమాకి ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే..
ఈ బైక్ సిటీ ప్రాంతానికి చాలా అనుగుణంగా ఉండే హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పవచ్చు.. కోమాకి బైక్ సింగిల్ డ్యూయల్ బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుందట. సింగిల్ బ్యాటరీ తో వచ్చే ఈ స్కూటర్ 85 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.. డ్యూయల్ బ్యాటరీతో వచ్చే ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.. ఈ కోమాకి ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ చేయాలి అంటే 4:55 నిమిషాలలోనే ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చట.. సింగిల్ బ్యాటరీ వర్షన్ పై మాత్రం 19 వేల రూపాయలు తగ్గింపు అందిస్తోంది.. అదిరిపోయే స్క్రీన్ తో నావిగేషన్ తోపాటు ఆన్ బోర్డ్ సౌండ్ సిస్టమ్ ,బ్లూటూత్ కనెక్టివిటీ, ఇండికేటర్, ఎల్ఈడి లైట్స్ ఇతరత్రా ఫీచర్లను సైతం తీసుకువచ్చింది ఈ కోమాకి ఎలక్ట్రిక్ బైక్.