దీని ఫలితంగా తక్కువ లైటింగ్ తో ఎంతో సౌకర్యవంతంగా వాట్సాప్ ను సైతం వినియోగించుకునే విధంగా వీలుంటుందట.. దీనివల్ల యూజర్స్ కళ్ళ పైన ఎలాంటి ఒత్తిడి ఉండదని తెలియజేసింది.. వాట్సప్ వెబ్ సైడ్ బార్ మెసేజ్ క్వాలిటీని అప్గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రత్యేక బ్యాగ్రౌండ్ కలర్ ను కూడా ఆవిష్కరించేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది వాట్సాప్. ఇలాంటి మార్పుల వల్ల వాట్సప్ ఇంటర్ ఫేస్ మరింత మెరుగుపరిచే విధంగా ఉంటుంది. ఈ అప్డేట్ యొక్క ముఖ్య ఉద్దేశం తక్కువ కాంతిలో వాట్సాప్ ను ఉపయోగించవచ్చని దీనివల్ల కళ్ళకు ఎలాంటి ఒత్తిడి ఉండదట.
ఆండ్రాయిడ్ వినియోగదారుల అంచనాలకు అనుగుణంగానే ఇందులో పలు రకాల రంగులను కూడా మార్పులు చేయబోతున్నారు. సరికొత్త లేఅవుట్ టెస్టింగ్ వాట్సాప్ సంస్థ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండబోతోంది.. అందుకు సంబంధించి పూర్తి వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్..WABETAINFO వివరాలను సైతం వెల్లడించింది.. వాట్సాప్ స్టేటస్ అప్డేట్ లో కూడా మరో రెండు అదనపు బటన్లను సైతం విడుదల చేయబోతోంది. ఇందులో కెమెరా పెన్సిల్ ఐకాన్లు వంటివి ఉంటాయట వీటి ద్వారా ఫోటో వీడియో ఇతర టెక్నికల్ స్టేటస్ లను అప్డేట్ చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో వాట్సప్ అనేక ఫీచర్స్ ని సైతం తీసుకువస్తూనే ఉంది.