ప్రస్తుత కాలంలో ఎక్కువగా చాలామంది మొబైల్ ఉపయోగం ఎక్కువగా వినియోగిస్తూ ఉన్నారు.. ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్మార్ట్ మొబైల్ ఉంటోంది. స్మార్ట్ మొబైల్ లేనిది ప్రజలు కూడా ఉండలేకపోతున్నారు.. స్మార్ట్ మొబైల్ ఉపయోగిస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. కొన్ని సందర్భాలలో మొబైల్ పేలుతూ ఉంటాయి. అయితే మొబైల్ పేలడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం..



మొబైల్ పేలడానికి ముఖ్య కారణం బ్యాటరీ.. స్మార్ట్ మొబైల్స్ లో ఉండే లితియం అయాన్ బ్యాటరీ ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు కారణమవుతున్నాయట.. స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా ఈ రకం బ్యాటరీలని వినియోగిస్తూ ఉన్నాయి. పలు రకాల కంపెనీలు.. బ్యాటరీ లో ఉండే ధన రుణ ఆయాన్లు సైతం ఒకదానికి ఒకటి తాగితే కచ్చితంగా బ్యాటరీ లో ఉండే రసాయన చర్య వల్ల పేలుడు సంభవిస్తుందట..


చాలామంది సైతం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అలాగే వాటికి పెట్టి వదిలేస్తూ ఉంటారు.. దీనివల్ల చార్జింగ్ ఫుల్ అయినప్పటికీ కూడా విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది.. అందువల్ల బ్యాటరీ ఎన్నో సందర్భాలలో హీట్ ఎక్కుతూ ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది.. అప్పుడు బ్యాటరీ లోపల భాగంలో పలు రకాల చీలికలు ఏర్పడి షార్ట్ సర్క్యూట్ కి కారణం అవుతాయట.


మొబైల్ బ్యాటరీలు సైతం ఉబ్బినట్లుగా కనిపించినా కూడా వెంటనే మొబైల్ నుంచి బ్యాటరీని తొలగించడం మంచిది.. ఎప్పుడైనా సరే మొబైల్ కి ఇచ్చిన కంపెనీ బ్యాటరీలు.. చార్జర్లను ఉపయోగించుకోవాలి.

చార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ కాల్స్ మాట్లాడడం కానీ.. గేమ్స్ ఆడడం కానీ వీడియోలు చూడడం గాని వంటివి చేయకూడదు.


ముఖ్యంగా పడుకునే సమయంలో మొబైల్ ని పక్కన పెట్టుకొని మాత్రం అసలు అడుకోకూడదు. దీనివల్ల వేడెక్కి పేలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మొబైల్ ఛార్జింగ్ ని ఎల్లప్పుడు ఏదైనా  ఖాళీగా ఉండే ప్రదేశాలలో పెట్టడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: