ఇటీవల కాలం లో ఎన్నో నగరాల లో టాక్సీ సర్వీస్ లు అందు బాటులో ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఈ టాక్సి సర్వీస్ల ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రయోజనాలను పొంద గలుగుతున్నారు. ఒకప్పుడు సొంత వాహనం లేక పోతే ఎంతో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు ఇక ఎన్నో కంపెనీ లు టాక్సీ సర్వీస్ లు అందు బాటు లో ఉంచిన నేపథ్యం లో ప్రస్తుతం ఎవరికి సొంత వాహనం అవసరమే లేకుండా పోయింది అని చెప్పాలి.


 ఒకప్పటిలా ఆర్టీసీ బస్సుల్లో ఇరుకు ఇరుకుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు నిలబడిన చోటుకే టాక్సీ వస్తుంది. ఇక ఎంతో దర్జాగా వెళ్లాల్సిన చోటికి వెళ్లగలుగుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా టాక్సీలలో వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. అదేంటి టాక్సీలకు ప్రత్యేకం గా ఏమైనా రహదారులు ఏర్పాటు చేయబోతున్నారా అంటారా.. అయితే రహదారులు కాదు ఏకంగా గాల్లో నడిచే టాక్సీలు అందుబాటు లోకి రాబోతున్నాయట.


 హైదరాబాద్కు చెందిన మారుతి డ్రోన్ సంస్థ భారత్లో eVTOL ఎయిర్ క్రాఫ్ట్ లను తీసుకు రావాలని భావిస్తుంది. ఇందుకోసం జపాన్ కంపెనీ స్కై డ్రైవ్ తో ఒప్పందం చేసుకుంది. అయితే బ్యాటరీతో నడిచే ఈ ఎయిర్ క్రాఫ్ట్ లను ఎయిర్ టాక్సీలు లేదా ఫ్లయింగ్ టాక్సీలు అంటారు. స్వల్ప దూర ప్రయాణాలకు వీటిని వినియోగిస్తారు అని చెప్పాలి. ఇది వాయు రవాణాలో విప్లవాత్మకమైన మార్కులకు కారణమవుతాయి అని ఇక కంపెనీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. మరి ఈ ఎయిర్ టాక్సీలు ఎప్పుడు అందుబాటు లోకి వస్తాయి అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: