ప్రస్తుతం పాన్ కార్డు అనేది చాలా ముఖ్యంగా మారుతోంది.ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు అయినా సరే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే.. ఆధార్ కార్డు తర్వాత అత్యంత ముఖ్యమైన కార్డులలో పాన్ కార్డు కూడా ఒకటి.. దేశంలో 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడు దగ్గర ఈ కార్డు ఉండాలి.. ముఖ్యంగా మన బ్యాంకు అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ కోసం ఆదాయ పన్ను శాఖ ఈ కార్డును సైతం జారీ చేస్తుంది.. ఎవరైనా బ్యాంకులో ఒకేసారి రూ .50,000 డిపాజిట్ చేయాలన్న ఇన్కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలన్న కూడా ఈ పాన్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే.


అయితే పాన్ కార్డు అప్లై చేసిన తర్వాత.. కనీసం రెండు వారాల తర్వాతే ఈ పాన్ కార్డు కస్టమర్ చేతికి వస్తుంది. కొన్ని సందర్భాలలో కాస్త ఎక్కువ సమయం అయిన పట్టవచ్చు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ పాన్ కార్డు  మనం ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉన్నది.. సాధారణంగా పాన్ కార్డు లాగే ఇది కూడా ఆర్థిక లావాదేవులకు సైతం మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతకీ ఈ పాన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి.. అందుకు తగ్గ ప్రాసెస్ ఏంటనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

1).ముందుగా ఇన్కమ్ టాక్స్ అధికారిక పోర్టల్ వెబ్సైట్లో వెళ్లాలి..
2). ఆ తర్వాత ఇన్స్టాంట్ ఈ పాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
3). ఆ తర్వాత గెట్ న్యూ పాన్ ఆప్షన్ కనిపిస్తుంది వాటిపైన క్లిక్ చేయాలి.
4). అనంతరం ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేసి చెక్ బాక్స్ పైన టిక్ మార్క్ చేసిన తర్వాత క్లిక్ చేసి కంటిన్యూ బటన్ పైన క్లిక్ చేయాలి.
5). ఆ వెంటనే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఆ ఓటిపి ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
6). ఆ తర్వాత ఆధార్ వివరాలు చెక్ చేసి టర్మ్ యాక్సెప్ట్ చేస్తే చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి వెంటనే ఇన్స్టా ఈ పాన్ కార్డు లభిస్తుంది. ఇది పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: